Mask Wearing: వేడిగా ఉందని, చిరాకు వేస్తోందని మాస్కు ధరించడం లేదా.? అయితే ఓసారి ఈ వీడియో చూడండి..
Mask Wearing: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే...
Mask Wearing: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే పెరుగుతోన్న కేసులకు చెక్‌పెట్టడానికి మహారాష్ట్ర లాక్‌డౌన్ కూడా విధించింది. మొదటిసారి వ్యాపించిన కరోనా కంటే సెకండ్ వేవ్ ప్రమాదాకరంగా ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే కరోనాను అడ్డుకట్టవేయడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎంత ముఖ్యమో మాస్కులు ధరించడం కూడా అంతే ముఖ్యమని అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయితే చాలా మంది నిర్లక్ష్యంతో వ్వవహరిస్తూ మాస్కులు ధరించడానికి ఆసక్తి చూపించడం లేదు. వేడిగా ఉందని, చిరాకు వేస్తోందని మాస్కు తీసి పక్కన పడేస్తున్నారు. దీంతో ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పుణే పోలీసులు ఓ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా పోలీసులు పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆలోజింపచేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. ఈ వీడియలో కొందరు దివ్యాంగులు తాము మాస్కు పెట్టుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా తూచా తప్పకుండా మాస్కులను ధరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన పోలీసులు.. ‘మాస్క్ పెట్టుకోవడం చిరాకుగా ఉంది. ఉక్కపోత్సోంది. అసలు మాస్క్‌ను ధరించలేను’ అంటూ చెప్పే వారి కోసమే ఈ వీడియో అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
పుణే పోలీసులు చేసిన ట్వీట్..
‘It’s feels so hot, can’t wear this mask’ – If you have used these words recently, then this video is for YOU.#WearAMask #COVIDSecondWave #coronavirus pic.twitter.com/9qKjXPCvLw
— PUNE POLICE (@PuneCityPolice) April 4, 2021
Also Read: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 1,097 మందికి పాజిటివ్, ఆరుగురు మృతి
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు.. ముస్తాబవుతున్న భాగ్యనగరం.