Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: అక్కడ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి బంపర్ ఆఫర్… మహిళలకు ముక్కుపుడక గిఫ్ట్

Vaccine Camp in Rajkot: గత ఏడాది చైనా వుహాన్ లో జనవరి లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తుంది. పేద, ధనిక దేశాలు అనే తేడా లేదు..ఉన్నవారు లేనివారు.. సెలబ్రెటీ, సామాన్యులు అందరూ కొవిడ్...

Covid-19 Vaccine: అక్కడ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి బంపర్ ఆఫర్... మహిళలకు ముక్కుపుడక గిఫ్ట్
Vaccine Camp In Rajkot
Follow us
Surya Kala

|

Updated on: Apr 05, 2021 | 3:19 PM

Vaccine Camp in Rajkot: గత ఏడాది చైనా వుహాన్ లో జనవరి లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తుంది. పేద, ధనిక దేశాలు అనే తేడా లేదు..ఉన్నవారు లేనివారు.. సెలబ్రెటీ, సామాన్యులు అందరూ కొవిడ్ 19 బాధితులే. ఇప్పటికే ప్రపంచంతో పాటు.. మన దేశంలో కూడా కరోనాతో ఎంతో మందితో కోల్పోయాం. ఇక దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు సెకండ్ వేవ్ సునామీ సృష్టిస్తూ..భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు 45 ఏళ్ళు దాటిన వారికి.. అవసరమైన వారికీ వ్యాక్సిన్ వేయమని ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా మంది ప్రజలు ఈ టీకా తీసుకోవడం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇస్తున్నా కేసులు పెరగడంతో టీకా వలన ఉపయోగం లేదు అన్న భావనలో ఉన్నారు. వేయించుకున్నా వేయించుకోకున్నా కరోనా రాకమానదు అని ఆలోచిస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో ప్రజలు వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రజల్లో చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారులు .. సామజిక చైతన్యం తీసుకుని రావడానికి తన వంతు బాధ్యతగా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

గుజరాత్ లోని ప్రముఖ పట్టణం సూరత్‌ కు చెందిన బంగారు వ్యాపారుల సంఘం వ్యాక్సినేషన్ వేయించుకునేలా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఉచితంగా ముక్కుపుడక ఇస్తామని ప్రకటించారు. అదే పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే… హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇలానైనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. కరోనా ప్రభావం తగ్గుతుందని.. బంగారు వ్యాపారుల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఊరికాని ఊరిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం.. లంచ్‌గా అన్నంలో నీరు..ఉల్లిపాయ.. హార్ట్‌టచింగ్‌ స్టోరీ!

హిందువుల పూజ్యనీయ మొక్క తులసి పెరుగుదల ఆ ఇంటి వైభవానికి చిహ్నమా.. అకస్మాత్తుగా ఎండిపోతే..!