Heartbreaking Picture: ఊరికాని ఊరిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం.. లంచ్‌గా అన్నంలో నీరు..ఉల్లిపాయ.. హార్ట్‌టచింగ్‌ స్టోరీ!

ఆధునిక టెక్నాలజీ తో అంబరాన్ని అందుకున్నామని సంతోషించేవారు ఒకరు. జల్సా గా గడుపుతూ..ఇష్టారీతిన బతికేవారు కొంతమంది అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కనీస అవసరాలకు కూడా నోచుకోని స్థితిలో...

Heartbreaking Picture: ఊరికాని ఊరిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం.. లంచ్‌గా అన్నంలో నీరు..ఉల్లిపాయ.. హార్ట్‌టచింగ్‌ స్టోరీ!
Malaysia Security Guard
Follow us
Surya Kala

|

Updated on: Apr 05, 2021 | 2:51 PM

Heartbreaking Picture: ఆధునిక టెక్నాలజీ తో అంబరాన్ని అందుకున్నామని సంతోషించేవారు ఒకరు. జల్సా గా గడుపుతూ..ఇష్టారీతిన బతికేవారు కొంతమంది అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కనీస అవసరాలకు కూడా నోచుకోని స్థితిలో బతుకుబండిని కొనసాగిస్తున్నారు. ఓ వైపు అనేకమంది ఆహారం ఎక్కువై వృధా చేస్తుంటే.. మరోవైపు ఒక్క పూట తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలినంత తిండిలేక ఆకలి కేకలతో కృశించి మరణిస్తున్నారు.

అయితే , టెక్నాలజీతో పరుగులు పెడుతున్న 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ ఫోటో తాజాగా ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. దీని చూసిన వారంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మలేషియాకు చెందిన అపిత్‌ లిడ్‌ అనే ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటోను చూస్తే హృదయం ద్రవించిపోతోంది. ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్‌ డ్రెస్‌ ధరించిన ఒక వ్యక్తి లంచ్‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే అతని లంచ్‌ బాక్స్‌లో నీళ్లతో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి.

ఆ బాక్స్‌లో కనీసం పచ్చడి,మజ్జిగ లాంటివి కూడా ఏమి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ తెచ్చుకున్నాడు. ఈ ఫోటోను షేర్‌ చేసిన ఆపిల్‌ లిడ్‌.. సదరు వ్యక్తికి సంబంధించిన డీటైల్స్‌ను షేర్‌ చేశారు. ‘‘ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడే.. కష్టపడి పని చేస్తాడు. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీకి దూరంగా వేరే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడని తెలిపాడు. తనకు వచ్చిన వేతనంలో ఎక్కువశాతం కుటుంబానికే పంపిస్తూ..తాను మాత్రం చాలా తక్కువ మొత్తం ఉంచుకుని… ఇలా తాను మిగుల్చుకున్న డబ్బులతో ఇలాంటి భోజనం చేస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Also Read: హిందువుల పూజ్యనీయ మొక్క తులసి పెరుగుదల ఆ ఇంటి వైభవానికి చిహ్నమా.. అకస్మాత్తుగా ఎండిపోతే..! 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్