30 years of Akshay Kumar: అక్షయ్ కుమార్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. 53 ఏళ్ల వయసులోనూ అదే ఎనర్జీ
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..! ఈ మాటకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. జస్ట్... ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో వుండడమే కాదు.. ఇండస్ట్రీలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నారు అక్కీ.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..! ఈ మాటకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. జస్ట్… ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో వుండడమే కాదు.. ఇండస్ట్రీలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నారు అక్కీ. అక్షయ్ నటించిన డెబ్యూ మూవీ సౌగంధ్ రిలీజై సరిగ్గా 30 ఏళ్లయింది. 53 ఏళ్ల వయసులో కూడా యూత్‌ఫుల్ హీరోలకు పోటీనిస్తూ.. మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ అనిపించుకుంటున్నారు అక్షయ్. యాక్షన్, కామెడీ, రొమాన్స్‌తో పాటు.. బయోపిక్ కంటెంట్‌ని కూడా జబర్దస్త్‌గా హ్యాండిల్ చేయగలరన్న పేరుంది అక్షయ్‌కి. అన్ని రకాల జానర్స్‌నీ ఓ పట్టు పట్టడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డుల్ని కూడా బద్దలుకొట్టే టాలెంటుంది అక్షయ్‌కి. అదే చేత్తో సౌత్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. సెభాష్ అనిపించుకున్నారు. 2.ఓలో విలన్‌గా నటించి..సూపర్‌స్టార్ రజనీకి దీటుగా పెర్ఫామ్ చేసిన పర్‌ఫెక్ట్ ఆర్టిస్ట్ అక్షయ్‌కుమార్.
30 ఏళ్లలో దాదాపు 100 సినిమాల్లో నటించి… రెమ్యునరేషన్ లెక్కల్లోనే కాదు.. పాపులారిటీలో కూడా పీక్స్‌లో వున్నారు అక్షయ్. రీసెంట్‌గా లక్ష్మీ మూవీలో ట్రాన్స్‌జెండర్ రోల్‌లో నటించి మరోసారి అయ్యామ్ ది ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన బచ్చన్ పాండే మూవీ ఫస్ట్ లుక్.. అక్షయ్‌లోని వెర్సటాలిటీని మళ్లీ చాటి చెప్పింది.
Also Read:
Krack OTT Release: బ్లాక్‌బాస్టర్ ‘క్రాక్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?
Ravi Teja Birthday: మాస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎనర్జీ లెవల్స్ పీక్స్.. ఈ రోజు రవితేజ బర్త్ డే..