Actress Aliya Bhatt: ఓటీటీలోకి అలియా భట్ సినిమా.. భారీ డీల్ కుదుర్చుకున్న నెట్‌ఫ్లిక్స్ ?
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అంతేకాకుండా జయంతిలాల్ గడా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక గంగూబాయి కతియావాడి ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదిరినట్లుగా సమాచారం.
ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అలియా భట్ నటిస్తున్న గంగూబాయి కతియావాడి సినిమా డిజిటల్ హక్కులను రూ.100 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా టాక్. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌ను తెరకెక్కిస్తున్నారు. అటు ఈ సినిమా థియేటర్ రైట్స్ కూడా భారీ బడ్జెట్‌కు విక్రయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదలకానుట్లుగా సమాచారం.