Priyanka : ఆ ప్రచారం చేసినందుకు చాలా బాధపడుతున్నా.. శరీర సౌందర్యం గురించి బాలీవుడ్ బ్యూటీ ఏం చెబుతుందంటే..

Priyanka Chopra: శరీర సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులను ప్రచారం చేసినందుకు గానూ పశ్చాత్తాపడుతున్నానని బాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రియాంక చెబుతున్నారు.

  • uppula Raju
  • Publish Date - 5:25 am, Wed, 27 January 21
Priyanka : ఆ ప్రచారం చేసినందుకు చాలా బాధపడుతున్నా.. శరీర సౌందర్యం గురించి బాలీవుడ్ బ్యూటీ ఏం చెబుతుందంటే..

Priyanka Chopra: శరీర సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులను ప్రచారం చేసినందుకు గానూ పశ్చాత్తాపడుతున్నానని బాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రియాంక చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. చిన్నతనంలో నల్లటి శరీరం కలిగి ఉంటే అందంగా లేనట్లుగా భావించేదానినని చెప్పారు. వివిధ సౌందర్య ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. వాటికి ప్రచారం చేయడం ద్వారా వర్ణ వివక్ష, జాత్యంహకారాలను ప్రచారం చేస్తున్నానని తనపై చర్చ జరిగినట్లు తెలిపారు.

శరీర రంగు గురించి ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. చిన్న తనంలో చామనఛాయ కలిగిన తాను ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాసుకోవడం ద్వారా అందంగా కనిపిస్తానని అనుకునేదానినని గుర్తు చేసుకున్నారు. మా కుటుంబంలో నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను మాత్రం చామనఛాయతో తక్కువ రంగు కలిగి ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా ‘కాళి.. కాళి’ అని పిలిచేవారని తెలిపారు. తనకు13ఏళ్ల వయసున్న సమయంలో ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాయడం మొదలు పెట్టా అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

#MSDhoni: ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్‌కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!