ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న యాంకర్ ప్రదీప్ సినిమా.. డైరెక్టర్ సుకుమార్ సలహా ప్రకారం..

యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న యాంకర్ ప్రదీప్ సినిమా.. డైరెక్టర్ సుకుమార్ సలహా ప్రకారం..
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2021 | 5:01 AM

యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మున్నా పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమా గురించిన పలు విషయాలను వెల్లడించారు. ‘పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం ఇదని, ఒకరినొకరు ద్వేషించుకునే ఓ జంట ముప్పై రోజుల్లో ఎలా ప్రేమలో పడ్డారన్నది స్టోరీ అని చెప్పారు.

ఎస్వీబాబు నిర్మాతగా వ్యవహరించగా అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిందన్నారు. తొలుత ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌లో చేయాల్సిందని కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదని అన్నారు. హాస్యనటుడు భద్రం ద్వారా నిర్మాత ఎస్వీబాబుని కలిసి కథ వినిపించానని ఆయనకు నచ్చడంతో సినిమా మొదలుపెట్టామని పేర్కొన్నారు. దేవదాస్‌, పార్వతి ప్రేమకథ నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇదని చెప్పారు. ఎలాంటి కథను ఎంచకున్నా దానిని ఎలా తెరపై ఆవిష్కరిస్తున్నావనేది ముఖ్యమని సుకుమార్‌ ఇచ్చిన సలహాను నమ్మి ఈ సినిమా చేశానని డైరెక్టర్ మున్నా వివరించారు.

‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాపై కెప్టెన్ గోపినాధ్ ప్రశంసలు.. గుండెను తాకిందంటూ ట్వీట్..