AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..

బాలీవుడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి అందాల భామ శిల్పాశెట్టి భర్త అందుకు కారణం అయ్యారు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..
Sagarika
TV9 Telugu Digital Desk
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 20, 2021 | 11:14 AM

Share

Raj Kundra: బాలీవుడ్ రాజ్ కుంద్రా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అందాల భామ శిల్పాశెట్టి భర్త మరోసారి చిక్కుల్లో పడ్డారు. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మించి పలు యాప్స్ లో వాటిని అప్ లోడ్ చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ రాజ్ కుంద్రా పై పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఫిక్స్ లో అతడి హస్తం ఉందని వార్తలు వచ్చాయి. గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా అతడి పై నిషేదం విధించబడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. అంతే కాదు గతంలో ఆయన మహిళలను కించపరిచేలా కొన్ని వివాదాస్పద ట్వీట్స్ కూడా చేశారు .

Raj

తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోర్న్‌ వీడియోలను యాప్‌లో విడుదల చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాజ్‌ కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మోడల్ రాజ్ కుంద్రా కు సంబంధించి సంచలన విషయాలు తెలిపింది. సాగరిక సోనా సుమన్ అనే మోడల్ వీడియో ద్వారా తానకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో తనకు వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చిందని దానికి సంబంధించి ఆడిషన్  చేయాలంటూ రాజ్ కుంద్రా సిబ్బంది కాల్ చేశారని తెలిపింది. కరోనా సమయం కావడంతో వీడియో కాల్ లో ఆడిషన్ చేయాలని అన్నారు. అయితే వీడియో కాల్ లో న్యూడ్ ఆడిషన్ చేయాలని అన్నారు. ఆ కాల్ లో రాజ్ కుంద్రా కూడా ఉన్నారు.. కానీ మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారని ఆమె అంది. న్యూడ్ ఆడిషన్ అనేసరికి నేను షాక్ అయ్యాను. వెంటనే నేను చేయను అని చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారని తెలిసి దైర్యంగా బయటకు వచ్చానని. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని అంటుంది సాగరిక.

మరిన్ని ఇక్కడ చదవండి :

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?

Hero Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్.. బాలయ్య సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత