AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikrant Massey: కుమారుడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న ’12th ఫెయిల్’ హీరో.. ఫొటోస్ చూశారా?

th ఫెయిల్ సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయాడీ ట్యాలెంటెడ్ హీరో. చిన్న సినిమాగా వచ్చిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయలు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయోత్సాహంలో ఉండగానే విక్రాంత్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

Vikrant Massey: కుమారుడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న '12th ఫెయిల్' హీరో.. ఫొటోస్ చూశారా?
Vikrant Massey Family
Basha Shek
|

Updated on: Mar 31, 2024 | 4:36 PM

Share

‘12th ఫెయిల్‌’ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే. అంతకు ముందు పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించినా విక్రాంత్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 12 th ఫెయిల్ సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయాడీ ట్యాలెంటెడ్ హీరో. చిన్న సినిమాగా వచ్చిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయలు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయోత్సాహంలో ఉండగానే విక్రాంత్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న హీరో భార్య శీతల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విక్రాంత్ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కుమారుడికి వర్దాన్ అని పేరు పెట్టుకున్న 12th ఫెయిల్ హీరో ఇప్పుడు పుత్రోత్సాహంలో ఉప్పొంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తన బిడ్డపై ప్రేమకు ప్రతీకగా కుమారుడి పేరు ‘వర్దాన్’ చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అలాగే వర్దాన్ పుట్టిన తేదీని కూడా ట్యాటుగా ముద్రించుకున్నాడు. అనంతరం ఆ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇకపై భార్యతో పాటు కుమారుడికి తన ప్రేమను పంచాలి. ప్రేమ అనేది వ్యసనసం’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు విక్రాంత్.

ప్రస్తుతం విక్రాంత్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పుత్రోత్సాహం అంటే ఇదేనేమో అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా విక్రాంత్, శీతల్ లది ప్రేమ వివాహం. సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 ఫిబ్రవరి 14న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఇప్పుడీ ప్రేమకు ప్రతీకగానే వర్దాన్ వారీ జీవితాల్లోకి అడుగుపెట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబా , ముంబైకర్ , సెక్టార్ 36, యార్ జిగ్రీ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు విక్రాంత్ మాస్సే.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో విక్రాంత్ మాస్సే..

మా జీవితంలో మరొక వ్యక్తి వచ్చాడు..

భార్య షీతల్ తో హీరో విక్రాంత్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్