Shah Rukh Khan Son Abram: కింగ్ ఖాన్ బుడ్డోడి స్కూల్ ఫీజ్ తెలిస్తే.. షాకవ్వాల్సిందే.!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అబ్రామ్ ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇప్పటివరకు పాఠశాలలో జరిగే అన్ని పోటీలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇటీవల జరిగిన ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలలోనూ పాల్గొన్నాడు. తన తండ్రి షారుఖ్ సిగ్నేచర్ ఫోజ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అబ్రామ్ ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇప్పటివరకు పాఠశాలలో జరిగే అన్ని పోటీలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇటీవల జరిగిన ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలలోనూ పాల్గొన్నాడు. తన తండ్రి షారుఖ్ సిగ్నేచర్ ఫోజ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదే పాఠశాలలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తనయులు.. ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య కూడా చదువుకుంటున్నారు. అయితే ఈ పాఠశాలలో చదివే స్టార్ కిడ్స్ స్కూల్ ఫీజులు తెలిస్తే మాత్రం గుండె ఆగిపోవాల్సిందే.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు ఒక్కో తరగతికి మారుతూ ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఎల్‌కెజి నుండి 7వ తరగతి వరకు నెలవారీ ఫీజు దాదాపు 1.70 లక్షలుపైగానే ఉంటుంది. అలాగే 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు నెలవారీ ఫీజు 4.48 లక్షలు. 11వ, 12వ తరగతి ఫీజు దాదాపు 9.65 లక్షలు. స్కూల్ ఫీజు స్ట్రక్చర్ ప్రకారం అబ్రామ్ సంవత్సరానికి ఫీజు దాదాపు 20.40 లక్షలు. అయితే ఈ స్టార్ కిడ్ ఫీజే ఇప్పుడు నార్త్ మీడియాలో చెక్కర్లు కొడుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ భారతదేశంలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటి. 2003లో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్థాపించారు. 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. మొత్తం 7 అంతస్తుల భవనంలో ప్లే గ్రౌండ్, ఇంటర్నెట్ సౌకర్యం, టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్, టెన్నిస్ కోర్ట్ ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.