Tillu Square Collections: దిమ్మతిరిగే రేంజ్‌లో టిల్లు స్క్వేర్ కలెక్షన్స్‌.! వీడియో.

Tillu Square Collections: దిమ్మతిరిగే రేంజ్‌లో టిల్లు స్క్వేర్ కలెక్షన్స్‌.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Mar 31, 2024 | 12:56 PM

ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచేస్తోంది. దాంతో పాటే దిమ్మతిరిగే రేంజ్లో కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది టిల్లుగాడి డబుల్ ధమాకా మూవీ.! డీజే టిల్లు సీక్వెల్ కావడంతో ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచేస్తోంది. దాంతో పాటే దిమ్మతిరిగే రేంజ్లో కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది టిల్లుగాడి డబుల్ ధమాకా మూవీ.! డీజే టిల్లు సీక్వెల్ కావడంతో ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి ఏకంగా 27 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. దానికి తగ్గట్టే మొదటిరోజు భారీగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంది టిల్లు 2 మూవీ. ఫస్ట్ డే వరల్డ్‌ వైడ్ 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక అమెరికాలో ఈ సినిమా మొదటి రోజు 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు 50 కోట్లు దాటేస్తుందని.. సులభంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని భావిస్తున్నారు. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఇలా మొత్తానికి టిల్లు ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..