AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : శ్రీదేవికే చెమటలు పట్టించింది.. ఒక్క ఏడాదిలోనే 8 బ్లాక్‌ బస్టర్ సినిమాలతో రచ్చ.. ఇప్పుడు ఆమె కూతురు తోపు హీరోయిన్..

ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ముద్దుగుమ్మ. అంతేకాదు ఒక సంవత్సరంలోనే వరుసగా ఎనిమిది సూపర్‌హిట్ చిత్రాలను అందించింది. ఈ నటి మాధురీ దీక్షిత్, శ్రీదేవిలను కూడా వెనక్కు నెట్టింది. తరచుగా తారలు సంవత్సరాల తరబడి పనిచేసినా, వారి సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేవు.

Tollywood : శ్రీదేవికే చెమటలు పట్టించింది.. ఒక్క ఏడాదిలోనే 8 బ్లాక్‌ బస్టర్ సినిమాలతో రచ్చ.. ఇప్పుడు ఆమె కూతురు తోపు హీరోయిన్..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2026 | 5:38 PM

Share

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో 90వ దశకాన్ని తన అద్భుతమైన అందంతో, అభినయంతో ఏలిన అగ్ర నాయికల్లో రవీనా టాండన్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే వెండితెరపై తిరుగులేని విజయాలను అందుకున్న ఆమె, నాటి స్టార్ హీరోయిన్లు శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి దిగ్గజాలకు సైతం గట్టి పోటీనిచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఆమె సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1994వ సంవత్సరం రవీనా టాండన్ కెరీర్‌లో ఓ అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ఆమె నటించిన ఏకంగా 8 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘మోహ్రా’, ‘లాడ్లా’, ‘దిల్వాలే’, ‘అందాజ్ అప్నా అప్నా’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అప్పట్లో థియేటర్లను ఊపేశాయి. ఒకే ఏడాదిలో ఇన్ని విజయవంతమైన చిత్రాలను అందించడం ద్వారా నాటి స్టార్ హీరోయిన్లయిన శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లను సైతం వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించారు రవీనా.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఇక ట్రెండ్‌కు తగినట్లుగా మారుతున్న కాలంలోనూ గ్లామర్ , పర్ఫార్మెన్స్‌తో అలరిస్తున్న రవీనా వారసురాలిగా ఆమె కూతురు రాషా థడానీ కూడా ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న రాషా, తన అద్భుతమైన నటనతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటూ అప్పుడే టాపర్స్ జాబితాలో నిలుస్తోంది. తల్లి బాటలోనే నడుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాషా క్రైజ్ చూస్తుంటే భవిష్యత్తులో ఆమె కూడా పెద్ద స్టార్‌గా రాణించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

2023లో ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన మోడలింగ్ రోజుల సమయంలో తనకు నిరంతరం సినిమా ఆఫర్లు వస్తూ ఉండేవని రవీనా చెప్పింది. కానీ ఆమెకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని. యశ్ చోప్రా చిత్రం ‘డర్’ కోసం తననే మొదటి ఎంపికగా భావించారని, ఆ చిత్రంలో తర్వాత షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, జూహీ చావ్లా నటించారని ఆమె చెప్పింది. అయితే, ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించింది. ఎందుకంటే ఆమె ఎలాంటి సన్నివేశాలు చేయాలనుకోలేదు. అంతేకాకుండా, కరిష్మా కపూర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ‘ప్రేమ్ ఖైదీ’ చిత్రం కూడా రవీనాకు ఆఫర్ చేశారు. అజయ్ దేవ్‌గన్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ను కూడా రవీనా తిరస్కరించింది.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

రషా  తడానీ..

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

Follow Us