AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో హ్యాండ్ షేక్.. 3వ వన్డే తర్వాత మారిన సీన్.. హర్మన్‌ప్రీత్, స్మృతి మధ్య అసలేం జరిగింది?

India vs Zimbabwe Women: జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు విజయోత్సవాల్లో ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా ఎదురుపడిన సమయంలో ఇద్దరి మధ్య సాధారణ హ్యాండ్‌షేక్ జరగలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల్లో పలు ప్రశ్నలు మొదలయ్యాయి.

నో హ్యాండ్ షేక్.. 3వ వన్డే తర్వాత మారిన సీన్.. హర్మన్‌ప్రీత్, స్మృతి మధ్య అసలేం జరిగింది?
Harmanpreet Kaur Smriti Mandhana
Venkata Chari
|

Updated on: Oct 29, 2026 | 5:27 PM

Share

India vs Zimbabwe Women: జింబాబ్వేపై మూడో వన్డేలో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత సీనియర్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), కెప్టెన్ స్మృతి మంధానా (Smriti Mandhana) మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 4th T20I: వైభవ్‌కు షాక్ తప్పదా..? రీఎంట్రీకి సిద్ధమైన ఛోటా ప్యాకెట్..!

మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం అభినందించుకుంటున్న సమయంలో హర్మన్‌ప్రీత్ స్మృతి వైపు రావడం కనిపించింది. ఆ సమయంలో స్మృతి మరోవైపు చూస్తుండటంతో ఇద్దరి మధ్య సాధారణ హ్యాండ్‌షేక్ మిస్ అయింది. ఈ ఘటన కేవలం కొన్ని సెకన్లే జరిగినా.. భారత మహిళల క్రికెట్‌లో ఇద్దరూ కీలక ఆటగాళ్లు కావడంతో అభిమానుల దృష్టి వెంటనే దీనిపై పడింది.

ఇటీవలే భారత మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పు జరిగింది. హర్మన్‌ప్రీత్ స్థానంలో స్మృతి మంధానా నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. దీంతో ఈ తాజా వీడియోకు కెప్టెన్సీ మార్పును జోడిస్తూ సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయని నిర్ధారించే ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

పైగా రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 126 పరుగులు చేసినప్పుడు స్మృతి ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొట్టింది. ఈ విషయం కూడా తాజా ఘటనను అర్థం చేసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిందే.

ఎక్కువమంది చదివినది: 5 ఓవర్లలో 100 ఏంటి.. వాళ్లను చూస్తే నాకే భయమేసింది.. పాపం కివీస్ బౌలర్లు..: శ్రేయాస్ అయ్యర్

మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. వైష్ణవి శర్మ (Vaishnavi Sharma) ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ప్రతీక రావల్ (Pratika Rawal), షెఫాలీ వర్మ (Shafali Verma) అర్ధ సెంచరీలతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ వన్డే సిరీస్‌ను 3-0తో ముగించింది.

అసలు విషయం ఏంటి?

ప్రస్తుతం బయటకు వచ్చిన వీడియోలో హ్యాండ్‌షేక్ మిస్ అయిన విషయం మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఒక్క క్షణాన్ని ఆధారంగా చేసుకుని హర్మన్‌ప్రీత్, స్మృతి మధ్య విభేదాలు ఉన్నాయని తేల్చడం మాత్రం తొందరపాటు అవుతుంది. సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతున్నా.. ఇద్దరు ఆటగాళ్ల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక వ్యాఖ్య రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నో హ్యాండ్ షేక్.. హర్మన్‌ప్రీత్, స్మృతి మధ్య అసలేం జరిగింది?
నో హ్యాండ్ షేక్.. హర్మన్‌ప్రీత్, స్మృతి మధ్య అసలేం జరిగింది?
ప్రతి విషయాన్నీ వివరించాల్సిన అవసరం లేదు.. జీవిత పాఠం
ప్రతి విషయాన్నీ వివరించాల్సిన అవసరం లేదు.. జీవిత పాఠం
గీజర్ వాడుతున్నారా?ఈ చిన్న తప్పులే మీ కరెంట్ బిల్లు పెంచుతున్నాయి
గీజర్ వాడుతున్నారా?ఈ చిన్న తప్పులే మీ కరెంట్ బిల్లు పెంచుతున్నాయి
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
హీరోయిన్ కీర్తి సురేశ్‏కు చేదు అనుభవం..
హీరోయిన్ కీర్తి సురేశ్‏కు చేదు అనుభవం..
ఈ ఫుడ్ తింటే చాలు.. మహిళల్లో నీరసం, తలతిరుగుడు తగ్గి పోతాయ్..
ఈ ఫుడ్ తింటే చాలు.. మహిళల్లో నీరసం, తలతిరుగుడు తగ్గి పోతాయ్..
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.