5 ఓవర్లలో 100 ఏంటి.. వాళ్లను చూస్తే నాకే భయమేసింది.. పాపం కివీస్ బౌలర్లు..: శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer Comments: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రశంసించారు. అలాగే, బౌలర్లకు యార్కర్లు వేయమని ఇచ్చిన సూచనతో పరుగులను నియంత్రించగలిగామని వెల్లడించారు.

Shreyas Iyer Comments: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీం ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ముందుగానే కైవసం చేసుకుంది. ఈ ఘన విజయం తర్వాత టీం ఇండియా T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల విధ్వంసకర బ్యాటింగ్‌ను, అలాగే తమ బౌలింగ్ వ్యూహాన్ని గురించి వివరించారు.
ఓపెనర్ల ప్రదర్శనపై శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. “అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ ఆడిన షాట్లను చూసేందుకు నా రెండు కళ్ళు సరిపోలేదని” ఆయన పేర్కొన్నారు. కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగులు చేయడం వంటి ప్రదర్శనను అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అయ్యర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది టీం ఇండియా అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్ సమయంలో తాను, సంజు శాంసన్ క్రీజులో ఉన్నప్పుడు బంతి బాగా స్వింగ్ అయిందని, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అంత సులభంగా, స్వేచ్ఛగా ఎలా బ్యాటింగ్ చేయగలిగారోనని తాను ఆశ్చర్యపోయానని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. వారి నైపుణ్యం, ధైర్యం తమకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన స్పష్టం చేశారు.
కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!
అలాగే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో తమ బౌలింగ్ వ్యూహం గురించి కూడా శ్రేయస్ అయ్యర్ వివరించారు. మ్యాచ్‌లో 10 ఓవర్ల తర్వాత తనకు ఒక విషయం అర్థమైందని తెలిపారు. బౌలర్లు హార్డ్ లెన్త్ లేదా హాఫ్ వాలీలు వేసినప్పుడల్లా న్యూజిలాండ్ బ్యాటర్లు వాటిని సులభంగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నారని తాను గమనించానన్నారు. ఈ పరిస్థితిని గ్రహించి, వెంటనే బౌలర్లకు తగిన సూచనలు చేశానని అయ్యర్ తెలిపారు. “అందుకే బౌలర్లని వీలైనన్ని ఎక్కువ యార్కర్లు వేయమన్నాను. అవసరమైతే ఆరు బంతులు కూడా యార్కర్లే వేయాలని చెప్పాను” అని అయ్యర్ వివరించారు.
Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!
ఈ వ్యూహం ద్వారా పరుగుల వేగాన్ని ఓవర్‌కు ఎనిమిది లేదా తొమ్మిది రన్స్‌కు పరిమితం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బౌలర్లు తమ సూచనలను తూచా తప్పకుండా పాటించడంతో, న్యూజిలాండ్‌ను 200 పరుగుల లోపు కట్టడి చేయగలిగామని శ్రేయస్ అయ్యర్ అన్నారు. లేకుంటే, వారి స్కోర్ 220 పరుగులకు పైగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి, మూడు సున్నాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇది జట్టు కృషికి నిదర్శనమని అయ్యర్ వ్యాఖ్యానించారు. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆశిస్తున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఈ విజయం టీం ఇండియా T20 జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




