దెబ్బమీద దెబ్బ..! చినికి చినికి గాలివానగా డాన్ 3 వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్.?
ధురందర్ సినిమాతో వెయ్యికోట్ల భారీ హిట్ కొట్టిన రణ్‌వీర్ సింగ్.. మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్. అలాంటి హీరో ఇకపై తెరపై కనిపించరా? చినికి చినికి గాలివానగా మారిన డాన్-3 వివాదం రణ్‌వీర్ కెరీర్‌ను ప్రశ్నార్దకంలో పడేసిందా? అసలు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ విధించిన బ్యాన్ అస్త్రం లీగలేనా? FWICE నిర్ణయాన్ని రణ్‌వీర్ కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు బాలీవుడ్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి.

ధురంధర్ టూ పార్ట్స్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రణ్‌వీర్.. కొద్దిరోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. మరోవైపు డాన్-3 వివాదం ముదిరి పాకాన పడింది. ఏకంగా ఈ అగ్ర హీరోపై బ్యాన్ విధించే దాకా వెళ్లింది సిట్యువేషన్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ రోల్ పోషించాల్సిన రణ్‌వీర్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ మూడేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో బ్యానర్ ఐటమ్‌గా మారిపోయారు రణ్‌వీర్. అప్పట్లో డాన్ -3 టీజర్ మూవీపై ఎంతో హైప్‌ని క్రియేట్ చేసింది. మరి.. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.. 2023లో ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రణ్‌వీర్ సింగ్ హీరోగా డాన్-3 అధికారికంగా ప్రకటించింది. అప్పుడే ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. అయితే సినిమా తీయడంలో ఆలస్యం కావడం.. స్క్రిప్ట్‌లో సమస్యలు తలెత్తడంతో రణ్‌వీర్ మూవీ నుంచి వైదొలిగినట్టు వార్తలొచ్చాయి.
రణ్‌వీర్ తన డాన్ పాత్రను మరింత డార్క్.. ఇంకాస్త హింసాత్మకంగా చూపించాలని కోరారని.. అందుకు ఫర్హాన్ అక్తర్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. షూటింగ్ ఆలస్యం కావడంతో రణ్‌వీర్ అసహనం వ్యక్తం చేస్తూ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడనే టాక్ అప్పట్లో వినిపించింది. డాన్- 3 నుంచి వైదొలిగాక ఫర్హాన్ అక్తర్‌కు రణ్‌వీర్ పదికోట్లు ఆఫర్ చేశారట. అలాగే నెక్స్ట్ మూవీ ప్రళయ్‌లో అక్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇవ్వడానికి కూడా హీరో అంగీకరించారన్న వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
అంతలోనే ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రణ్‌వీర్‌పై 45కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులిచ్చింది. ఈ పరిణామాల మధ్య ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ రణ్‌వీర్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. మరిప్పుడు రణ్‌వీర్ ఏం చేస్తారు? ఇది ప్రభుత్వం విధించిన నిషేధం కాదని.. రణ్‌వీర్‌పై పెద్దగా ప్రభావం ఉండబోదంటున్నాయి సినీవర్గాలు. మరోవైపు FWICE విధించిన బ్యాన్‌పై రణ్‌వీర్ ప్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వాటికంటే.. టికెట్ ధరలు, కార్మికుల జీతాలు, AI ముప్పులాంటి ముఖ్యమైన సమస్యలపై ఫెడరేషన్ దృష్టి పెడితే బాగుంటుందని సెటైర్లు విసురుతున్నారు.




