AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదే

ఈసారి భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా తప్పింది. దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానున్నది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది..

Monsoon: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
Kerala Misses Early Date With Monsoon
Srilakshmi C
|

Updated on: May 27, 2026 | 8:15 AM

Share

హైదరాబాద్‌, మే 27: భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనాలు పూర్తిగా తప్పాయి. సాధారణంగా ప్రతీయేట జూన్ 1వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాల సాంప్రదాయ ఆరంభంగా ప్రవేశిస్తుంటాయి. భారతదేశంలో అత్యంత కీలకమైన వాతావరణ వ్యవస్థ నైరుతి రుతుపవనాలు. ఇవి కేరళకు తాకి అక్కడ వర్షాలు కురిపించిన తర్వాత నాలుగు నెలల పాటు ఉత్తరం వైపు ఇతర రాష్ట్రాల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఇవి దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి.

ఎక్కువ మంది చదివినది: ‘లీక్ జరగలేదు, అంతా పారదర్శకం’.. మెగా డీఎస్సీ 2025 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ క్లారిటీ

కానీ ప్రస్తుతం కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. దాంతో రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే మరికాస్త ఆలస్యం కానున్నాయి. అంటే జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. దక్షిణ తీర రాష్ట్రమైన కేరళలోనే రుతుపవనాలు మొదటగా ప్రవేశిస్తాయి. ఇది దేశమంతటికీ ఉపశమనం కలిగించేలా చల్లని గాలులు, వర్షాలు కురిపించే ప్రారంభ సంకేతం.

ఎక్కువ మంది చదివినది: ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు.. తలకిందులు కానున్న రుతుపవన వ్యవస్థ! సైంటిస్టుల సీరియస్ వార్నింగ్

ఎన్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఒక నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం నడిచే రైలు కాదని తేలింది. రుతుపవనాల ఆగమనాన్ని ప్రకటించడానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. కేరళలోని 14 కేంద్రాలలో కనీసం 60 శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అలాగే గాలి వేగం, మేఘాల సాంద్రత వంటివి కూడా అనుకూలంగా ఉండాలి. మే 25 నాటికి కేరళలో ఈ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని ఐఎండీ తెలిపింది. లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేయాలి. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో సాధారణంగా కురిసే తొలకరి జల్లులు మాత్రమే పడుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం అవుతుండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. మే 27 (బుధవారం) కేరళ , లక్షద్వీప్‌లకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎమ్‌డి హెచ్చరికలు జారీ చేసింది. ఈ భారీ వర్షాల హెచ్చరికను వారాంతం వరకు పొడిగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us