AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీటర్లు పగిలిపోయే రేంజ్‌లో ఉష్ణోగ్రతలు..! ప్రపంచ వేడి నగరాల లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు.. రిపోర్ట్ ఇదిగో..

దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న వేళ.. ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ సిటీల్లో 97 నగరాలు భారత్‌లోనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఖమ్మం, సూర్యాపేట.. ఏపీలో రాజమహేంద్రవరం వంటి నగరాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.. నిపుణుల ప్రకారం.. ఉత్తరాది నుంచి వీచే వేడి, పొడి ‘లూ’ గాలులే ఈ భయంకర వడగాల్పులకు ప్రధాన కారణం..

మీటర్లు పగిలిపోయే రేంజ్‌లో ఉష్ణోగ్రతలు..! ప్రపంచ వేడి నగరాల లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు.. రిపోర్ట్ ఇదిగో..
Heatwave
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2026 | 8:51 AM

Share

హీట్‌ వేవ్‌లో ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది. భానుడి దెబ్బకు దేశవ్యాప్తంగా బ్యారో మీటర్లు పగిలిపోయే రేంజ్‌లో ఉష్ణోగ్రతలు బ్లాస్ట్ అవుతున్నాయి! వరల్డ్ హాటెస్ట్ సిటీస్ టాప్-100 లిస్ట్ రిలీజ్ అయితే.. అందులో ఏకంగా 97 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ఈ ఫైర్‌ జోన్‌లో మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉంటే.. ఏపీలోని రాజమహేంద్రవరం ఈ వరల్డ్‌ హాటెస్ట్‌ సిటీల జాబితాలో ఉన్నాయి. 46 డిగ్రీల టెంపరేచర్‌తో ఈ ప్రాంతాలు అగ్నిగుండాల్లా మారాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ రేంజ్‌లో ఉంటే రానున్న రోజుల్లో సిచ్యూవేషన్‌ మరింత తీవ్రమైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాలుల ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తన్నారు.

వేసవి సీజన్లో రెండు రకాల గాలులు

సాధారణంగా వేసవి సీజన్లో భారత్‌లో రెండు రకాల గాలులు వీస్తుంటాయి. ఒకటి హాట్ అండ్ డ్రై, అంటే వేడితో కూడిన పొడి గాలులు, రెండోది హాట్ అండ్ హ్యూమిడ్. అంటే వేడితో కూడిన తేమ గాలులు. ఇందులో వేడితో కూడిన పొడి గాలులనే ‘లూ’ అని పిలుస్తారు. ఈ సీజన్లో దేశంలోని ఉత్తర వాయువ్య ప్రాంతాల నుంచి ఇవి వీస్తుంటాయి. అయితే వాయువ్య ఎడారి ప్రాంతం, గల్ఫ్ దేశాలతోపాటు అరేబియా సముద్రం వైపు నుంచి భారత్‌లోకి ఈ వడగాల్పులు ప్రవేశిస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వీచే ఈ ‘లూ’ గాలులు.. తెలుగు రాష్ట్రాల వైపు కూడా విస్తరించి ఇక్కడి తీవ్రమైన వడగాల్పులకు కారణమవుతున్నాయి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

‘లూ’ గాలులు ప్రమాదకరమైనవని హెచ్చరిక

ఈ ‘లూ’ గాలులు అత్యంత ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వడగాల్పుల సమయంలో ప్రజలు ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

కోస్తా తీర ప్రాంతాల్లో తేమతో కూడిన గాలులు ఎక్కువ

కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువగా తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కానీ తీరప్రాంతానికి దూరంగా ఉండే అంతర్గత భూభాగాలు మాత్రం ఈ ‘లూ’ గాలుల ప్రభావానికి ఎక్కువగా గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీ కంటే.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఏప్రిల్‌, మే నెలలోనే కాదు.. రానున్న జూన్ నెలల్లోనూ ఈ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.

జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాలు

తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రావడానికి జూన్ మొదటి లేదా రెండో వారం దాటవచ్చు. అప్పటివరకు ఈ వేసవి తీవ్రత, ముఖ్యంగా ‘లూ’ గాలుల సెగలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు వచ్చే వరకు ప్రజలంతా ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండక తప్పదు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us