AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raids: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేపట్టాయి. ఎక్సాలాజిక్ కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని అద్దె ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ED Raids: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు
Pinarayi Vijayan
Venkatrao Lella
|

Updated on: May 27, 2026 | 8:13 AM

Share

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. పినరయి విజయన్ ఇంటిపై బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఎక్సాలాజిక్ కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని అద్దె ఇంట్లో సోదాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నూర్‌లోని ఆయన ఇంట్లో కూడా సోదా జరుగుతున్నట్లు సమాచారం. పినరయి విజయన్ అద్దె ఇల్లు, కన్నూర్‌లోని ఆయన ఇల్లు, సీఎంఆర్ఎల్ కార్యాలయంతో సహా 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించడానికి ఈడీకి అనుమతినిస్తూ మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది.  మరోవైపు సీఎంఆర్ఎల్ ఎండీ శశిధరన్ కర్త ఇంటిలో కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

కోజికోడ్‌లోని మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ ఇంటిలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.  ఈ కేసులో ఈడీ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ కరిమనల్ కంపెనీ ఎండీ శశిధరన్ కర్తా, కంపెనీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కేఎస్ సురేష్ కుమార్, ఉద్యోగులు అంజు రాచెల్, చంద్రశేఖరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వారం రోజుల సమయం కావాలని కంపెనీ చేసిన అభ్యర్థనను కూడా కోర్టు కొట్టిపారేసింది. పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ కంపెనీకి, అందించని సేవలకు లక్షల రూపాయలు చెల్లించారని ఎస్‌ఎఫ్‌ఐఓ కనుగొన్న నేపథ్యంలో ఈడీ కూడా తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో తమకు సమన్లు ​​జారీ చేసి సోదాలు నిర్వహించిన తర్వాత విచారణ పేరుతో తమను హింసిస్తున్నారని, కంపెనీపై ఈడీ దర్యాప్తు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోఈడీ దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us