AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha kapoor: పండగంటే ఇది కదా.. లగ్జరీ కారు కొన్న సాహో నటి, ధరెంతో తెలిస్తే..

బాలీవుడ్ నటి శద్ధకపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆషికి2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమా తెలుగులో విడుదలకాక పోయినా చిత్రం సాధించిన విజయం కారణంగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక సాహోతో ప్రభాస్‌ సరసన నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువైందీ చిన్నది. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును...

Shraddha kapoor: పండగంటే ఇది కదా.. లగ్జరీ కారు కొన్న సాహో నటి, ధరెంతో తెలిస్తే..
Shraddha Kapoor
Narender Vaitla
|

Updated on: Oct 25, 2023 | 10:56 AM

Share

పండక్కి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా ఇంట్లోకి పండగ వేళ కొత్త వస్తువు తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు. కొందరు స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేస్తే మరికొందరు ఓ బైక్‌ను కొనుగోలు చేస్తారు. ఇక కొంత డబ్బున్న వారైతే ఓ కారును కొనుగోలు చేస్తారు. అయితే తాజాగా సాహో బ్యూటీ ఓ కారు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

బాలీవుడ్ నటి శద్ధకపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆషికి2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమా తెలుగులో విడుదలకాక పోయినా చిత్రం సాధించిన విజయం కారణంగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక సాహోతో ప్రభాస్‌ సరసన నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువైందీ చిన్నది. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని ఈ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది.

ప్రస్తుతం శ్రద్ధ కారుతో దిగిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీనికి కారణంగా శ్రద్ధ కొనుగోలు చేసిన కారు ధరే. అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్‌ టెక్నికా అనే మోడల్‌ను శ్రద్ధా కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు కాస్త తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ కారు ధర ఎంతో చెప్పలేదు కదూ! అక్షరాల రూ. 4 కోట్లు. అవును నిజమే లగ్జరీ కార్లను పెట్టింది పేరైన లాంబొర్గినికి చెందిన ఈ హై ఎండ్‌ కారులో అత్యాధుని ఫీచర్స్‌ ఉంటాయి.

కొత్త కారుతో శ్రద్ధ..

ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండడంతో ఫ్యాన్స్‌ శద్ధకు కాంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇన్ని కోట్ల విలువైన కారు కొనుగోలు చేయడం విశేషమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక శద్ధ కెరీర్‌ విషయానికొస్తే.. ఈ బ్యూటీ 2010లో వచ్చి పట్టి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఆషికి-2 చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధ ప్రస్తుతం స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us