Kalki 2898 AD: కల్కి టీంకి సర్‌ప్రైజ్ ఇచ్చిన డార్లింగ్ ఫ్యాన్స్.. ఇంప్రెస్ అయిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..
ప్రజెంట్ సలార్, కల్కి 2898 ఏడీ, మారుతి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అందుకే ఈ బర్త్ డే సందర్భంగా అద్దిరిపోయే అప్‌డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ అలాంటిదేం రాలేదు. దీంతో ఫ్యాన్సే డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌తో మేకర్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు. డార్లింగ్ బర్త్ డే సందర్భంగా సలార్, కల్కి 2898 ఏడీ టీమ్స్ నుంచే మేజర్ అప్‌డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్.
Updated on: Oct 25, 2023 | 10:48 AM

ప్రజెంట్ సలార్, కల్కి 2898 ఏడీ, మారుతి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అందుకే ఈ బర్త్ డే సందర్భంగా అద్దిరిపోయే అప్‌డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ అలాంటిదేం రాలేదు. దీంతో ఫ్యాన్సే డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌తో మేకర్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు.

డార్లింగ్ బర్త్ డే సందర్భంగా సలార్, కల్కి 2898 ఏడీ టీమ్స్ నుంచే మేజర్ అప్‌డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ రెండు మూవీ యూనిట్స్ జస్ట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసి సరిపెట్టేశాయి. దీంతో ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. అదే విషయం సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అయ్యింది. కానీ అభిమానులు అక్కడితో ఆగిపోలేదు. మేకర్స్ మిస్ చేసినా ఫ్యాన్ మేడ్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేశారు.

కల్కి టీమ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోయినా... ఓ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది అంటే... ఏకంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ వీడియోను తన పేజ్‌లో షేర్ చేసే రేంజ్‌లో వైరల్ అయ్యింది ఫ్యాన్ మేడ్ లిరికల్ వీడియో.

సినిమా థీమ్‌ను ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేస్తూ హై ఎండ్ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన లిరికల్ వీడియోను మాస్క్ మ్యాన్ స్టూడియోస్ అనే ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు. ఓన్‌గా లిరిక్స్ రాసి పాడి, ఆ వీడియోకు యాడ్ చేశారు. దీంతో ఇది అఫీషియల్ లిరికలేనా అన్న రేంజ్‌లో ఉంది ఆ సాంగ్.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌ను ఈ సినిమాకు ఖర్చు పెడుతున్నారు. ముందు 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా... అన్ని పనులు పూర్తి కావన్న ఉద్దేశం తో వాయిదా వేశారు.




