Viral: ఆమెకు ఇందిరా గాంధీతో పోలికలున్నాయట.. ఆ బాలీవుడ్ నటి ఎవరో గుర్తుపట్టారా?
Viral News: సినీ తారలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం కామన్‌గా మారిపోయింది. టాప్ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఇలా యాక్టివ్‌గా ఉండే వారిలో బాలీవుడ్ నటి..
Viral News: సినీ తారలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం కామన్‌గా మారిపోయింది. టాప్ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఇలా యాక్టివ్‌గా ఉండే వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర ఫొటోలోను పోస్ట్ చేసింది. తన చిన్ననాటి ఫొటోలను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించింది.
చిన్న తనంలో షార్ట్ హెయిర్‌తో ఉన్న సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసిన కంగనా.. ‘నేను ఎదుగుతున్న సమయంలో నన్ను మా కుటుంబసభ్యలు ఇందిరా గాంధీ అంటూ పిలిచేవారు. దీనికి నా షార్ట్ హెయిర్ స్టైలే కారణం’ అంటూ రాసుకొచ్చింది. ఇక మరో ఫొటోతో పాటు.. ‘నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరి హెయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యేదాన్ని కాదు. గ్రామంలో ఉండే బార్బ్ వద్దకు వెళ్లి.. నేనే స్వయంగా కటింగ్ ఎలా చేయాలో అతనికి చెప్పేవాడిని. నా హెయిర్ స్టైల్ ఎప్పుడూ షార్ట్‌గా ఉండాలని కోరుకునే దాన్ని. ఈ కారణంగానే నన్ను ఇందిరాగాంధీ అంటూ పిలిచేవారు. మరీ ముఖ్యంగా ఆర్మీలో ఉండే మా అంకుల్స్ ఈ విషయాన్ని చెబుతుండే వారు’ అంటూ రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కంగనా ఇంది గాంధీ పాత్రలో కనించనుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కంగనా ఫస్ట్‌లుక్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. కంగనా లుక్ అచ్చంగా ఇందిరా గాంధీని పోలినట్లుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..