Dulquer Salmaan-Mrunal Thakur: మ్యాజిక్ రిపీట్.. మరో అందమైన ప్రేమకథకు సిద్ధం అవుతున్న సీతారామం టీమ్
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీతారామం సినిమా గురించే.. ఎలాంటి ఎక్స్పెటెషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకోవడమే కాదు..
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీతారామం సినిమా గురించే.. ఎలాంటి ఎక్స్పెటెషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ కు కొత్త ఊపిరినిచ్చింది. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యుద్ధం రాసిన ప్రేమకథ అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక దుల్కర్ సల్మాన్ నటనకు మృణాల్ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే జంటతో దర్శకుడు హను రాఘవపుడి మరో అందమైన ప్రేమకథను తెరకెక్కించనున్నాడు. ఇదే విషయాన్నీ బడా నిర్మాత అశ్విని దత్ కన్ఫామ్ చేశారు. త్వరలోనే మృణాల్, దుల్కర్ తో హను రాఘవపూడి దర్శకత్వంలో మరో అందమైన ప్రేమ కథనుతీసుకువస్తాం అని అశ్వినిదత్ అన్నారు. ఇటు దుల్కర్, అటు మృణాల్ సీతారామం సినిమాతో సూపర్ హిట్ ను సాధించడంతో ఈ ఇద్దరికీ టాలీవుడ్ లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి సినిమా చేస్తున్నారని తెలియడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమ కథను తెరకెక్కిస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..