Ameesha Patel: చూసుకోవాలి కదా అమ్మడూ … తారక్ పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన బాలీవుడ్ బ్యూటీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కోమురం భీమ్ గా తారక్ నటనతో అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పై ప్రశంసలు కురిపిస్తూ చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు ఇప్పటికీ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తారక్ పై ట్వీట్ చేసింది. కానీ ఆమె చేసిన పొరపాటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్(Ameesha Patel) గుర్తుందా..? తెలుగులో ఈ చిన్నది పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మహేష్ సరసన నాని, పవన్ కు జోడీగా బద్రి సినిమాల్లో నటించింది. అలాగే తారక్ తో కలిసి నరసింహుడు అనే సినిమాలో నటించింది అమీషా.
తాజాగా ఈ అమ్మడు తారక్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నేను తారక్ తో కలిసి నటించిన నరసింహుడు సినిమాలోని ఫోటో ఇది. ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్లీ కో స్టార్, నిజాయితీ కల వ్యక్తి అంటూ తారక్ పై ప్రశంసలు కురిపించింది అమీషా. అయితే తారక్ పేరుకు బదులు.. వేరే ఫ్యాన్ మెడ్ ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేసింది అమీషా. దాంతో నెటిజన్లు చూసుకోవాలి కదా అంటూ ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. అయితే అది గమనించిన అమీషా మరో ట్యాగ్ ను జత చేసింది. అది కూడా తారక్‌ది కాదు. దాంతో మూడో సారి ట్వీట్ చేస్తూ తారక్ పేరు ట్యాగ్ లేకుండా షేర్ చేసింది.
THROWBACK WEEKEND.. a cute pik from my Telugu film w/ junior NTR .. he was a huge TELUGU SUPERSTAR then as well n today seeing him getting such PAN INDIA love with the film RRR makes me soo happy .. lovely co star .. hardworking and humble ??????? pic.twitter.com/sCcfrmVvis
— ameesha patel (@ameesha_patel) September 18, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..