Legend Saravanan: ఈసారి యాక్షన్ కమ్ రొమాంటిక్ స్టోరీతో రానున్న లెజెండ్ శరవణన్
లెజెండ్ శరవణన్(Legend Saravanan)ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్.
లెజెండ్ శరవణన్(Legend Saravanan)ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు.
లెజెండ్ శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆయన, ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..