AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజాకార్ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్..! కేంద్ర హోంశాఖ అలర్ట్‌..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమాలో... ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. పలువురు సీనియర్‌ నటులు సైతం ఈ సినిమాలో మంచి రోల్స్‌ ప్లే చేశారు.

రజాకార్ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్..! కేంద్ర హోంశాఖ అలర్ట్‌..
Razakar Movie Review
TV9 Telugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Mar 21, 2024 | 10:10 PM

Share

రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తనకు 1,100 బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది నుంచి తనకు హానీ ఉందన్నారాయన. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా 1 ఫ్టస్‌ 1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

లోక్‌సభ ఎన్నికల వేళ రజాకార్ సినిమా విడుదల కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమాలో… ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. పలువురు సీనియర్‌ నటులు సైతం ఈ సినిమాలో మంచి రోల్స్‌ ప్లే చేశారు.

వివాదాస్పద చిత్రం రజాకార్ మార్చి 15న తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలైంది. రజాకార్లు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ చివరికి తెలంగాణ హైకోర్టు విడుదలను క్లియర్ చేసింది. రజాకార్ సినిమా విడుదలను అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.