Ramayan: రణబీర్, సాయిపల్లవి ‘రామాయణం’ పై ట్విస్ట్.. ఇంకెప్పుడు క్లారిటీ వచ్చేది..
రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే వీరందరికీ లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యిందని..
భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు అత్యధిక క్యూరియాసిటి ఉన్న సినిమా రామాయణం.. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే వీరందరికీ లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యిందని… అలాగే బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, లరా దత్తా మిగతా నటీనటులు సైతం కీలకపాత్రలలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అటు స్టార్ సెలబెట్రీస్ కూడా మౌనంగా ఉండడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ?లేదా ? అనే సందేహాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, దర్శకుడు నితీష్ తివారీ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తారని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ కేవలం రణబీర్ కపూర్, సాయి పల్లవి చుట్టూ మాత్రమే తిరుగుతుందట. ఈ స్టోరీ సీత అపహరణతో ముగుస్తుంది. ఇందులో హనుమంతుడు, రావణుడి పాత్రలు ఎక్కువగా కనిపించవు. ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభమై 2 నెలల పాటు షూటింగ్ జరుపుకోనుందని.. రావణుడి పాత్రలో కనిపించబోతున్న యష్ ఈ సినిమాకు 15 రోజుల పాటు షూట్ చేయబోతున్నాడని, ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని యష్ గురించి వార్తలు వచ్చాయి.
‘రామాయణం’ పాత్రల కాస్ట్యూమ్స్‌పై చిత్ర నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాపై డైరెక్టర్ నితీష్ తివారీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమపై మరో న్యూస్ వైరలవుతుంది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, చిత్ర నిర్మాతల మధ్య పరస్పర విబేధాల కారణంగా ‘రామాయణం’ ఈ సినిమా చిత్రీకరణకు మరిన్ని రోజులు సమయం పడుతుందట. చిత్ర నిర్మాతలు పరస్పర సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే ‘రామాయణం’ ప్రారంభిస్తారట. ఈ సినిమా షూటింగ్ పనులు మరికొన్ని రోజులు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ వస్తాయా ? అని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే అని చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.