Avatar 2 Collections: ఆశ్చర్యపరుస్తోన్న అవతార్ 2 కలెక్షన్స్.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా..

'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. తాజాగా మరో రికార్డు దీని ఖాతాలో జమైంది..

Avatar 2 Collections: ఆశ్చర్యపరుస్తోన్న అవతార్ 2 కలెక్షన్స్.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా..
Avatar 2 Becomes 7th Biggest Grossing Movie
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 10:55 AM

‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. తాజాగా మరో రికార్డు దీని ఖాతాలో జమైంది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ 3డీ ఫిక్షన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 మువీల జాబితాల సరసన చోటుదక్కించుకుంది. అవతార్‌ 2 అత్యధిక వసూళ్లు రాబట్టిన ఏడో చిత్రంగా స్థానం దక్కించుకొంది. గతంలో 1.67 బిలియన్‌ డాలర్లతో 7వ స్థానంలో ‘జురాసిక్‌ వరల్డ్‌’ పేర ఉన్న ఈ రికార్డు ప్రస్తుతం అవతార్‌2 ఎగరేసుకుపోయింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి విడుదలైన ఏ చిత్రం కూడా అంతర్జాతీయ టిక్కెట్ విక్రయాలలో అవతార్‌ను బీట్‌ చేయలేదు. త్వరలో ఈ మువీ ఎలైట్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మువీ 2 బిలియన్‌ డాలర్ల మార్కుకు (1.7 బిలియన్‌ డాలర్లు) అత్యంత చేరువలో ఉంది.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ రేస్‌లో దూసుకు పోయిన మువీలలో.. అవతార్ (2.9 బిలియన్ డాలర్లు), అవెంజర్స్: ఎండ్‌గేమ్ (2.79 బిలియన్ డాలర్లు), టైటానిక్ (2.2 బిలియన్ డాలర్లు), స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ (2.069 బిలియన్ డాలర్లు), అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2.04 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. త్వరలో అవతార్‌ 2కూడా ఈ జాబితాలో చేరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.