Throw Back: టెంపర్‌లో పోసాని పాత్రకు మొదట అనుకుంది ఎవరినో తెలుసా.? ఆయన నటించి ఉంటేనా…

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టెంపర్‌' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిజినెస్‌ మ్యాన్‌ చిత్రం తర్వాత సరైన విజయం లేక సతమతమవుతోన్న పూరీ కెరీర్‌ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పైకి లేపిందీ సినిమా. పూరీ మార్క్‌ దర్శకత్వం ఎన్టీఆర్‌ నట విశ్వరూపం...

Throw Back: టెంపర్‌లో పోసాని పాత్రకు మొదట అనుకుంది ఎవరినో తెలుసా.? ఆయన నటించి ఉంటేనా...
Temper Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 10, 2023 | 10:12 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెంపర్‌’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిజినెస్‌ మ్యాన్‌ చిత్రం తర్వాత సరైన విజయం లేక సతమతమవుతోన్న పూరీ కెరీర్‌ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పైకి లేపిందీ సినిమా. పూరీ మార్క్‌ దర్శకత్వం ఎన్టీఆర్‌ నట విశ్వరూపం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. జూనియర్‌ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిందీ సినిమా. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కానిస్టేబుల్ మూర్తి. పోసాని కృష్ణ మురళి చేసిన ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా ఎన్టీఆర్‌కు, పోసానికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌. సినిమా విజయంలో పోసాని కూడా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అయితే ఇంతలా పాపులర్‌ అయిన ఈ పాత్ర కోసం పూరి తొలుత అనుకున్నదని పోసానిని కాదని మీకు తెలుసా.? పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి కోసం పూరీ జగన్నాథ్ ఈ పాత్రను రాసుకున్నాడు. అందుకునే పూరీ ఈ పాత్రకు మూర్తీ అనే పేరు పెట్టాడు. అయితే పూరీ జగన్నాథ్‌ ఎంత ప్రయత్నించినా నారాయణ మూర్తి పాత్ర చేయడానికి ఇష్టపడలేదంటా, చివరికి ఎన్టీఆర్‌ అడిగినా సున్నితంగా తిరస్కరించారు. దీంతో మూర్తీ పాత్రను పోసాని చేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే అసలు నారాయణ మూర్తి ఆ పాత్రను ఎందుకు చేయలేదన్న దానిపై తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ పాత్రను నేను చేస్తే.. సినిమా ఆడేస్తుంద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ ఆ ఆఫ‌ర్ ఇవ్వ‌లేదు. నాతో ఆయ‌న ఒక డిఫ‌రెంట్ వేషం.. గొప్ప వేషం వేయించాల‌ని అనుకున్నాడు. ఆ క్యారెక్ట‌ర్ నాకు ఉప‌యోగ‌ప‌డాల‌ని ఆ నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత గొప్ప పాత్ర‌ను ఇవ్వాల‌ని అనుకున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు నా సెల్యూట్’ అని చెప్పుకొచ్చారు. ఇక జూనియ‌ర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొద‌లుపెట్టి.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. హీరోగా ఎదిగాను.. ఇక చేస్తే ఐదారేండ్ల‌కు మించి సినిమాలు చేయ‌లేను. ఇలాంటి స‌మ‌యంలో మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వెన‌క్కి వెళ్ల‌ద‌ల‌చుకోలేద‌ని నారాయణ మూర్తి ఆ సమయంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..