Pooja Hegde: ఆ టాలీవుడ్ సీనియర్ హీరోకు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే .?

తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్ , ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

Pooja Hegde: ఆ టాలీవుడ్ సీనియర్ హీరోకు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే .?
Pooja Hegde
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2023 | 9:22 AM

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్ , ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, దళపతి విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సర్కస్ ఇలా వరుసగా ఫ్లాపులు అందుకుంది ఈ భామ. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమా ఒక్కటే.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది పూజా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది టాక్ వినిపిస్తోంది.

ఆ సీనియర్ హీరో ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున.. త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ దర్శకుడిగా నాగ్ తో సినిమా చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే ను అనుకుంటున్నారని టాక్. ఇప్పటికే నాగ్ కుమారులైన నాగ చైతన్య తో.. అలాగే అఖిల్ తో నటించింది పూజా మరి ఇప్పుడు నాగార్జున తో కలిసి నటిస్తుందేమో చూడాలి. ఈ వార్తలో వాస్తవమెంతో కానీ ఇలా తండ్రి కొడుకులతో కలిసి గతంలో కాజల్ నటించిన విషయం తెలిసిందే.