Rajamouli: ఆ హీరో కనుబొమ్మలతో కూడా నటించగలడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి జక్కన్న ఈ సంచలనాన్ని సృష్టించారు.
దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ నలుమూలలా వినిపిస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి జక్కన్న ఈ సంచలనాన్ని సృష్టించారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్, తారక్ ఒకరికొకరు పోటీపడి నటించారు. ఇక ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా కు మరెన్నో అరుదైన గౌరవాలు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీ చిత్రం. జనవరి 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డీజీఏ థియేటర్ లో ప్రదర్శించారు. దీనికి జక్కన్న, తారక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించారు. తారక్ ను ఆకాశానికెత్తేశారు జక్కన్న .
ఆర్ఆర్ఆర్ సినిమాలో అన్నింటికంటే నాకు కొమురం భీముడో పాట అంటే చాలా ఇష్టం. ఈ పాటలో తారక్ నటన అద్భుతం.. నేను డైరెక్ట్ చేసిన వాటన్నింటిలో ఆ పాట నా ఆల్ టైం ఫేవరెట్ అని అన్నారు. అలాగే తారక్ కనుబొమ్మల పై మీరు కెమెరా ఫోకస్ చేస్తే వాటితోనూ అతడు హావభావాలను పలికించగలడు అంటూ తారక్ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి.