Ashwin Babu: అశ్విన్ బాబు మేకోవర్ అదుర్స్.. ఆకట్టుకొంటోన్న ‘హిడింబ’ ఫస్ట్ లుక్ పోస్టర్..

హీరో అశ్విన్ బాబు.. రాజు గారి గది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆతర్వాత రాజుగారి గది2, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, రాజుగారి గది3 సినిమాలతో హీరోగా..

Ashwin Babu: అశ్విన్ బాబు మేకోవర్ అదుర్స్.. ఆకట్టుకొంటోన్న 'హిడింబ' ఫస్ట్ లుక్ పోస్టర్..
Ashwin
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2021 | 8:37 AM

Ashwin Babu: హీరో అశ్విన్ బాబు.. రాజు గారి గది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆతర్వాత రాజుగారి గది2, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, రాజుగారి గది3 సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈక్రమంలోనే  మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు హీరో అశ్విన్ బాబు. అనీల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ లో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హిడింబ అనే స్ట్రైకింగ్ టైటిల్ ని ప్రకటించారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

హిడింబ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగ్గట్టుగానే పోస్టర్ ను ఇంట్రస్టింగ్ గా డిజన్ చేశారు చిత్రయూనిట్. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ కి బిగ్ స్కోప్ ఉన్న చిత్రం అని అర్ధమవుతోంది. అశ్విన్ బాబు మేకోవర్ ఆకట్టుకుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 50శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని టాక్. ఈ సినిమా అశ్విన్ కు జోడీగా నందిత శ్వేతా నటిస్తుంది. శ్రీనివాస రెడ్డి, సాహితి ఆవంచ, సంజయ్ స్వరూప్,షిజ్జు, విద్యులేఖ రామన్,రాజీవ్ కనకాల, శుభలేక సుదకర్, ప్రమోదిని, రఘు కుంచె కీలక పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన