Aravind Swamy: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై అరవింద్ స్వామి కామెంట్.. మండిపడుతున్న నెటిజన్లు..

లాక్ డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవల థియేటర్స్ ఓపెన్ చేయడానికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. దీంతో ఎంతో హుషారుగా థియేటర్లు ఓపెన్ చేసిన కానీ

Aravind Swamy: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై అరవింద్ స్వామి కామెంట్.. మండిపడుతున్న నెటిజన్లు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2021 | 7:12 PM

లాక్ డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవల థియేటర్స్ ఓపెన్ చేయడానికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. దీంతో ఎంతో హుషారుగా థియేటర్లు ఓపెన్ చేసిన కానీ ప్రేక్షకులు మాత్రం అంతగా రావడం లేదు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి ప్రేక్షకులు మునుపటిలా వస్తారని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే థియేటర్లలో కేవలం 50 శాతం ఆక్యుపెన్నీ మాత్రమే ఉండాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఫుల్ జోష్‏గా థియేటర్లు నడిపించడానికి రెడి అవుతున్నారు.

ఇక తమిళనాడు ప్రభుత్వంలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 శాతం ఆక్యుపెన్సీని పెంచాలని ప్రభుత్వాన్ని అడిగేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో సీనియర్ నటుడు అరవింద్ స్వామి 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. కొన్ని సందర్బాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కంటే 50 శాతం ఆక్యుపెన్సీ ఎంతో బాగుంటుంది అని తెలిపారు. ఇక ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు రావడం ప్రారంభిస్తారు అనుకునే సమయంలో అరవింద్ స్వామి ఈ ట్వీట్ చేయడం.. తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఇక అరవింద్ స్వామి ట్వీట్ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అరవింద్ ట్వీట్‏ను సమర్థిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంపై తమిళనాట ప్రజలు సందీగ్ధంలో పడిపోయారు.

అరవింద్ స్వామి ట్వీట్..

Also Read:

Private: సంక్రాంతి బరిలోకి రానున్న మరో యంగ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన ‘మాస్టర్’ యూనిట్.. ఫ్యాన్స్‏కు పండగే..