Vishal: ఇది ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం

తెల్ల ఖాగీతంపై ఎలా సంత‌కం చేశారంటూ ప్ర‌శ్నించారు. ఇదేమీ సినిమా షూటింగ్ కాదంటూ, తెలివిగా స‌మాధానం చెబుతున్నానుకుంటున్నారా.? అంటూ కాస్త ఘాటుగానే బ‌దులిచ్చారు. కాస్త జాగ్ర‌త్త‌గా బ‌దులివ్వండి అంటూ జ‌డ్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పందెం కోడి 2 సినిమా స‌మ‌యాల్లో...

Vishal: ఇది ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం
Vishal
Follow us

|

Updated on: Aug 02, 2024 | 7:39 PM

న‌టుడు విశాల్‌పై మ‌ద్రాస్ హైకోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. లైకా ప్రొడెక్ష‌న్స్ సంస్థ త‌న‌పై వేసిన కేసులో భాగంగా గురువారం హైకోర్ట్‌కు వ‌చ్చిన విశాల్ ఇచ్చిన స‌మాధానంపై జ‌డ్జ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లైకాతో జ‌రిగిన ఒప్పందం గురించి ప్ర‌శ్నించ‌గా.. తాను కేవ‌లం తెల్ల కాగీతంపై సంత‌కం చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఈ స‌మాధానంపై జ‌డ్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెల్ల ఖాగీతంపై ఎలా సంత‌కం చేశారంటూ ప్ర‌శ్నించారు. ఇదేమీ సినిమా షూటింగ్ కాదంటూ, తెలివిగా స‌మాధానం చెబుతున్నానుకుంటున్నారా.? అంటూ కాస్త ఘాటుగానే బ‌దులిచ్చారు. కాస్త జాగ్ర‌త్త‌గా బ‌దులివ్వండి అంటూ జ‌డ్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పందెం కోడి 2 సినిమా స‌మ‌యాల్లో త‌లెత్తిన వ్య‌వ‌హార‌ల‌పై విశాల్‌ను ప్ర‌శ్నించారు.

పందెం కోడి2 విడుద‌ల‌కు ముందే డ‌బ్బు తిరిగి ఇచ్చేస్తాన‌ని మాటిచ్చారా.? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన విశాల్‌.. స‌మాధానం చెప్పేందుకు మాత్రం అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేదు… దీంతో మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌డ్జి, ఇలా ప్ర‌వ‌ర్తిసే కుద‌నర‌ద‌ని అన్నారు. దీంతో తాను లైకా ద‌గ్గర డ‌బ్బు అప్పుగా తీసుకున్న‌ట్లు విశాల్ అంగీక‌రించారు. అనంత‌రం కోర్ట్ ఈ కేసును శుక్ర‌వారానికి వాయిదా వేశారు.

అస‌లేం జ‌రిగిందంటే… కోలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు, హీరో విశాల్‌కు మ‌ధ్య కొన్నేళ్ల క్రితం విభేదాలు త‌లెత్తాయి. సినిమా తీస్తాన‌ని త‌మ వ‌ద్ద విశాల్ రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బును విశాల్ చెల్లించ‌లేదంటూ నిర్మాత‌లు మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల‌ని కోర్ట్ ఆదేశించింది. విశాల్ న‌టించిన సినిమాల‌ను విడుద‌ల చేయ‌కూడ‌దంటూ స్టే విధించింది. అయితే విశాల్ కోర్టు తీర్పును ఉల్లంఘిచంచారని కోర్టును ఆశ్ర‌యించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం క్లిక్ చేయండి..