Manushi Chhillar: మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?

Manushi Chhillar: మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?

Anil kumar poka

|

Updated on: Aug 02, 2024 | 6:39 PM

జాన్వి కపూర్ బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహారియా సోదరుడితో నటి మానుషి చిల్లర్‌ ప్రేమలో పడ్డారా అంటే కన్ఫమ్‌ అంటున్నారు అభిమానులు. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మానుషి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ తో తెలుగువారికి పరిచయమైంది. ఈమె మాజీ విశ్వసుందరి కూడా.

జాన్వి కపూర్ బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహారియా సోదరుడితో నటి మానుషి చిల్లర్‌ ప్రేమలో పడ్డారా అంటే కన్ఫమ్‌ అంటున్నారు అభిమానులు. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

మానుషి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ తో తెలుగువారికి పరిచయమైంది. ఈమె మాజీ విశ్వసుందరి కూడా. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుందీ భామ. అయితే వింత పరిస్థితుల్లో ఈ విషయం బయటపడింది. బాలీవుడ్‌ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓరీ ఇటీవల ఓ వీడియో షేర్‌ చేశారు. జాన్వీకపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియాతోపాటు ఇతర స్నేహితులతో కలిసి తాను టూర్‌కు వెళ్లినట్లు ఈ వీడియోలో తెలిపారు. టూర్‌లోనూ జాన్వీ ఫొటోషూట్‌తో బిజీగా ఉన్నారన్నారు. ఇదే వీడియోలో మానుషి, శిఖర్‌ సోదరుడు వీర్‌ కలిసి కనిపించారు. వీర్‌ భుజంపై ఆమె సేదతీరుతూ కనిపించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. వీర్‌తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై వారిద్దరూ స్పందించలేదు.

హరియాణాకు చెందిన మానుషి చిల్లర్.. 2017లో విశ్వసుందరిగా నిలిచింది. అనంతరం ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ ఆమె తొలి చిత్రం. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ చిత్రాల్లో నటించింది. ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’ కోసం వర్క్‌ చేస్తుంది. కథానాయికగా తాను విభిన్నమైన చిత్రాల్లో నటించాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో మానుషి చెప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.