Anand Deverakonda : జోరు పెంచిన యంగ్ హీరో.. బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోని ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా దొరసాని తో విమర్శకుల ప్రసంశలు అందుకున్న..
Anand Deverakonda : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోని ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా దొరసాని తో విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ కుర్రహీరో.. కథలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ఇటీవలే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకాలేదు.. ఓటీటీవేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకోవడంతోపాటు నటుడిగా ఆనంద్ ను మరో మెట్టు ఎక్కించింది.
ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ త్వరలోనే తన నెక్స్ట్ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. బడా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. 118 సినిమాతో డైరెక్టర్ గా మారిన కేవి గుహన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుందట.ప్రస్తుతం కేవీ గుహన్ ‘హూ వేర్ వై’ అనే థ్రిల్లర్ మూవీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Hero Balakrishna: బాలయ్య కూడా అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నాడా ? ఆ నెలలో బాక్సాఫీసుల వద్ధ రచ్చే ఇక..