30 Rojullo Preminchadam Ela : మొదటి సినిమాతోనే మెప్పించిన ప్రదీప్.. అలరిస్తున్న’30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’
బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?. పదేళ్లకు పైగా టీవీలో యాంకర్ గా ఎన్నో స్టేజి షోలకు రియాలిటీ కార్యక్రమాలకు...
30 Rojullo Preminchadam Ela : బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’. పదేళ్లకు పైగా టీవీలో యాంకర్ గా.. ఎన్నో స్టేజి షోలకు రియాలిటీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి అలరించాడు ప్రదీప్. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 29 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రిలీజ్ కంటే ముందే నీలి నీలి ఆకాశం అనే పాట ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా అమృతా అయ్యర్ నటించింది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో ప్రదీప్ నటన ఆకట్టుకుంది. అవ్వడానికి మొదటి సినిమానే అయినా అనుభవం ఉన్న నటుడిగా నటించి మెప్పించాడు. సెంటిమెంట్ సీన్స్ లోను ఆకట్టుకున్నాడు ప్రదీప్. గత జన్మలో చనిపోయిన ప్రేమజంట.. మళ్లీ పునర్జన్మ ఎత్తి కలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు ప్రదీప్. హీరోయిన్ అమృతా అయ్యర్.. అమ్మాయిగారుగా చాలా క్యూట్‌గా కనిపించింది.. అలాగే అక్షరగా క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ చూపించింది. ఇక ప్రదీప్‌కి ఫ్రెండ్‌గా చేసిన హర్ష, భద్రంలు నవ్వులు పూయించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Anand Deverakonda : జోరు పెంచిన యంగ్ హీరో.. బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ