AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుంది.. మనసులో మాట బయట పెట్టిన ‘బ్యాడ్‌బాయ్‌’ భామ..

తెలుగులో సినిమా చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది అమ్రిన్‌ ఖురేషి. ‘సినిమా చూపిస్తా మావ’ ఆధారంగా

మహేశ్, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుంది.. మనసులో మాట బయట పెట్టిన ‘బ్యాడ్‌బాయ్‌' భామ..
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 5:49 AM

Share

తెలుగులో సినిమా చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది అమ్రిన్‌ ఖురేషి. ‘సినిమా చూపిస్తా మావ’ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘బ్యాడ్‌బాయ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది ఈ అమ్మడు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అమ్రిన్ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి మీడియాతో చిట్ చాట్ చేసింది.

ఇక్కడే పుట్టానని దీంతో హైదరాబాద్‌తో తనకు చక్కటి అనుబంధముందని అంది. ముంబయిలో నటనలో శిక్షణ తీసుకున్నానని చిన్నతనం నుంచి నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లో అడుగుపెట్టానని తెలిపింది. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగానని టాలీవుడ్‌లో మహేష్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని వారితో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టింది. ఇప్పుడిప్పుడే నా కెరీర్‌ ఆరంభమవుతోంది కనుక నటిగా నన్ను నేను నిరూపించుకునే ఆఫర్స్‌ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. శ్రీదేవి జీవితకథలో నటించే అవకాశం వస్తే పెద్ద బాధ్యతగా భావిస్తానని వెల్లడించింది. ‘జులాయి’ రీమేక్‌లో కూడా నటిస్తున్నానని చెప్పింది. కాగా రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్న ‘బ్యాడ్‌బాయ్‌’ చిత్రం ద్వారా మిథున్‌ చక్రవర్తి తనయుడు సమషి చక్రవర్తి హీరోగా పరిచయంఅవుతున్నాడు.