నిహారిక పెళ్లికి పూర్తైన ఏర్పాట్లు..రాజస్తాన్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. కొడుకుతోపాటు వెళ్లిన పవన్‌..

మెగా ఫ్యామిలీలో మెగా వెడ్డింగ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈరోజు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. నాగబాబు గారాలపట్టి నీహారిక, చైతన్యను..

నిహారిక పెళ్లికి పూర్తైన ఏర్పాట్లు..రాజస్తాన్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. కొడుకుతోపాటు వెళ్లిన పవన్‌..
Sanjay Kasula

|

Dec 10, 2020 | 5:57 AM

Niharika Wedding Ceremony : మెగా ఫ్యామిలీలో మెగా వెడ్డింగ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈరోజు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. నాగబాబు గారాలపట్టి నీహారిక, చైతన్యను వివాహమాడనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో రెండ్రోజుల నుంచి పెళ్లి హడావుడి కనిపిస్తోంది. తొలి రోజు సంగీత్‌.. తర్వాతి రోజు మెహందీ ఫంక్షన్లు స్వీట్‌గా జరిగాయి. మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరు ఈ వేడకకు హాజరయ్యారు.

డ్యాన్సులు, ఆటపాటలతో పెళ్లివేడుక సందడిగా మారింది. సంగీత్‌ సందర్భంగా యంగ్‌ మెగా హీరోస్‌ రాంచరణ్‌, బన్నీ, వరుణ్‌, సాయిధరమ్‌ డ్యాన్సులతో అదరగొట్టారు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా మెగా కాంపౌండ్‌ నుంచి లీకయ్యాయి. ఇక మెహందీ ఫంక్షన్‌లో మెగాస్టార్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. ఆయనే ముందుండి ఈ వేడుకను నడిపించారు. మెగా హిట్‌ ట్యూన్స్‌కు చిరంజీవి, నాగబాబుతోపాటు.. అతిథులు చిందులేశారు.

ఈరోజు రాత్రి ఏడుగంటల 15 నిమిషాలకు వివాహ మహోత్సవం జరగనుంది. అయితే ఈ వేడుకకు జనసేన అధినేత.. మెగా బ్రదర్‌ పవన్‌ కూడా హాజరయ్యారు. ఆయన కుమారుడు అకీరతో కలిసి ఉదయ్‌ పూర్‌ వెళ్లారు. ఇక ఉదయ్‌ నివాస్‌లో జరుగుతున్న పెళ్లి వేదిక అదిరిపోయింది.

రాజస్తానీ స్టైల్లో థీమ్‌ను ఏర్పాటు చేశారు. పెళ్లికి అతి కొద్దిమంది అతిథులనే పిలిచినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ నుంచి టాప్‌ హీరోలు.. హీరోయిన్లు హాజరవుతున్నారు. కొందరు డైరెక్టర్లు, నిర్మాతలను కూడా మెగా ఫ్యామిలీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu