6వ దఫా చర్చలకు ముందురోజు కీలక మలుపు, రైతు సంఘాల నేతలతో చర్చలు మొదలు పెట్టిన కేంద్రహోం మంత్రి అమిత్ షా
ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతోన్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు....

ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతోన్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలకోసం రైతు సంఘాల నేతలు ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. కేంద్రంతో రేపు 6వ దఫా చర్చలు జరుగనున్న నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరి, భారత్ బంద్ కు దారితీసిన నేపథ్యంలో జరుగుతోన్న ఈ భేటీలో ఎలాంటి పురోగతి వస్తుందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల్లోని కీలకపరిణామాలపై లైవ్ అప్డేట్స్ ఈ దిగువున.
LIVE NEWS & UPDATES
-
రేపు ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రి వర్గ సమావేశం. కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చించనున్న కేంద్ర మంత్రి వర్గం
-
ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలూ చర్చలకు హాజరు: రైతు సంఘం నేత రాకేశ్

-
-
చర్చల్లో పాల్గొన్న 13 రైతు సంఘాల నేతలు, కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్
-
పూసాలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి రైతులను తీసుకెళ్లి అక్కడున్న ఉన్నతాధికారులతో పాటుగా చర్చలు జరుపుతున్న అమిత్ షా
Published On - Dec 09,2020 11:21 AM



