ఏలూరులో విస్తరిస్తున్న వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. క్షణక్షణం భయం.. భయం..

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంతో పాటు సమీపంలోని దెందులూరు, ఆ చుట్టుప్రక్కల గ్రామాలను వింత వ్యాధి కలవరపెడుతోంది.

 • Ravi Kiran
 • Publish Date - 9:14 pm, Wed, 9 December 20
ఏలూరులో విస్తరిస్తున్న వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. క్షణక్షణం భయం.. భయం..

Eluru Disease: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంతో పాటు సమీపంలోని దెందులూరు, ఆ చుట్టుప్రక్కల గ్రామాలను వింత వ్యాధి కలవరపెడుతోంది. ప్రస్తుతం వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 571కి చేరింది. మొత్తం 468 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో 1 నుంచి 12 సంవత్సరాల మధ్య వారు 75 మంది ఉన్నారు. ఇందులో బాలురు 45, బాలికలు 30 మంది ఉన్నారు. 12 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 311 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 153మంది, మహిళలు 158 మంది ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 185 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 101, మహిళలు 84 మంది ఉన్నారు.

ఎయిమ్స్ బృందం రోగులను నుంచి శాంపిల్స్ సేకరించింది. కూరగాయల్లో రసాయనాలు, పాల కల్తీయే కారణమని ఎయిమ్స్ నిపుణుల అంచనాకు వచ్చారు. రోగుల వెన్నుముక నుంచి తీసిన నమూనాలపై చేసిన కల్చర్ పరీక్షల ఫలితాల్లోనే నెగిటివ్ వచ్చింది. బాధితుల శరీరాల నుంచి తీసిన శాంపిల్స్ లో నికెల్ , సీసం అవశేషాలు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అసలు ఈ వ్యాధికి గల కారణాలు ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఏలూరు అనారోగ్య పరిస్థితులపై మినిట్ టు మినిట్ అప్డేట్స్  ఈ దిగువున చూడొచ్చు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 09 Dec 2020 21:14 PM (IST)

  దేశంలోని ఏడు మేజర్ సిటీస్ లో లెడ్ శాతంతో బాధపడుతున్నవారి సంఖ్య 100 మిలియన్స్ వరకు ఉంటుందని అంచనా, ఏలూరులో 10 మైక్రో గ్రాములకు మించిన సీసం

  > దేశంలోని ఏడు మేజర్ సిటీస్ లో లెడ్ శాతంతో బాధపడుతున్నవారి సంఖ్య 100 మిలియన్స్ వరకు ఉంటుందని అంచనా
  > 12 సంవత్సరాల లోపు పిల్లలకే 50 శాతం వరకు లెడ్ సంబంధ రోగం
  > ఈ వ్యాధికి చిన్న పిల్లలు, గర్భవతుల పై ఎక్కువ ప్రభావం
  > లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు
  > నీటిలో సీసం, ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు సమస్యలు
  > లెడ్ అత్యంత విషపూరితమైన మూలకం
  > నేరుగా శరీరంలోకి తీసుకోవడం లేదా లెడ్ వాయువులను పీల్చడం హానికరం
  > శరీరంలో అధిక మొత్తంలో కాల్షియం, ఇనుము ఉంటే లెడ్ శరీరంలోకి ప్రవేశించినా ఇబ్బంది లేదు
  > సీసం వాయురూపంలో క్యూబిక్ మీటర్ కు 100 మి.గ్రా లకు మించవద్దు
  > మించితే సదరు వ్యక్తుల ఆరోగ్యం, ప్రాణాలకు తీవ్ర హాని
  > నేరుగా రక్తంలో కలుస్తున్న సీసం
  > మెదడు, మూత్ర పిండాలను పాడు చేసే సీసం
  > ప్రాణాలు తీసే సీసం
  > అమెరికా అంచనాల ప్రకారం.. పని ప్రదేశాల్లో అనుమతించదగిన లెడ్ పరిమాణం(8గంటలు) క్యూబిక్ మీటర్ కు 50 మైక్రో గ్రాములు వరకు ఉండవచ్చు.
  > రక్తంలో లెడ్ పరిమాణం 2012లో చేసిన లెక్కల ప్రకారం.. 100 గ్రాముల రక్తంలో 5 మైక్రోగ్రాముల వరకు సీసం ఉండవచ్చు
  > కానీ ఏలూరు రిపోర్టులో సీసం పరిమాణం…10 మైక్రో గ్రాములకు మించి ఉంది

 • 09 Dec 2020 20:55 PM (IST)

  ఏలూరు వింతరోగం: సీసం ప్రభావానికి గురైన వ్యక్తుల్లో కన్పించే లక్షణాలు

  > పొత్తి కడుపులో నొప్పులు
  > వేళ్లలో బలహీనత, మణికట్టు, మోచేతుల్లో నొప్పులు
  > రక్తపోటు స్వల్పంగా పెరగడం, మధ్య వయస్కుల్లో అనీమియాకు లోనవడం
  > గుండె బలహీనంగా కొట్టుకోవడం, మహిళల్లో గర్భ స్రావం, సంతాన కలిగే అవకాశాలు తగ్గటం
  > పురుషుల్లో వీర్య కణాల క్షీణత తదితర దుష్పప్రభావాలు

 • 09 Dec 2020 20:37 PM (IST)

  ఏలూరు వింతరోగం కొత్త కేసులు, డిశ్చార్జి అయిన వారి సంఖ్య, బాధితుల వివరాలు అప్డేట్

  Update data @ 7pm
  Total Admissions – 587

  On bed 42
  Refferal 33
  Discharge 511

  Abstract report upto 7pm :
  1 to 12 years – 74
  Male – 43
  Female – 31

  12 to 35 years – 325
  Male – 166
  Female – 159

  More than 35years – 188
  Male – 106
  Female – 82

 • 09 Dec 2020 20:31 PM (IST)

  శరీరంలో లెడ్(సీసం) శాతం పెరగటానికి కారణాలు

  > తాగునీరు, బోరు వాటర్, రోడ్డుపక్కన అమ్ముతున్నతినుపదార్ధాలలో వాడే రంగులు
  > ఇళ్ళలో పేరుకు పోయిన ధుమ్ము,ధూళి
  > పెయింట్స్, కుంకుమ, సింధూరం, కాస్మోటిక్ కలర్స్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, ప్లాంట్ ఫుడ్స్, సంప్రదాయ కారక మందులు
  > ప్రొటీన్ కలిగిన వస్తువులను మితంగా, అతిగా తీసుకున్నాసమస్యలే
  > కాల్షియం, ఐరన్, జింక్ తక్కువగా ఉన్నా ఈ లెడ్ శాతానికి ప్రమాదం
  > తక్కువ ధరకు దొరికే ప్లాస్టిక్ మగ్స్, లెడ్ పెన్సిల్స్, లెడ్ ఫ్రీ లేని రంగులు, బొమ్మలు వాడటం వల్ల సమస్య

 • 09 Dec 2020 20:06 PM (IST)

  ఏలూరులో వింత రోగం: శరీరంలో లెడ్ ఎక్కువైతే వచ్చే సమస్యలు.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే సీసం.!

  > లెడ్ వాడకం… నిర్మాణరంగం, ప్లంబింగ్, బ్యాటరీలు, బుల్లెట్స్, తూనికల బాట్లు, సోల్డరింగ్ పదార్థాలు, గ్యాసోలిన్, రేడియేషన్ నుంచి తప్పించే షీల్డుల తయారీ
  > ఏలూరు బాధితుల రక్తంలో సీసం(లెడ్) స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తింపు
  > తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో కేసులు
  > లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు
  > సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుంది
  > తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని అంచనా
  > అసలు సీసమ్ , నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనే అంశం పై పరిశోధన
  > రక్తంలో లెడ్ లోపించినా, పెరిగినా ప్రమాదమే
  > రక్తంలో 10 మైక్రోగ్రామ్స్ కు మించి లెడ్ ఉండకూడదంటున్న డాక్టర్లు
  > ఏలూరులో అంతకు మించి ఉన్న లెడ్ శాతం
  > పైకి ఆరోగ్యంగా ఉన్నా రక్తంలో లెడ్ శాతం పెరిగితే సమస్యలే
  > లెడ్ శాతం పెరిగితే నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు
  > మెదడుకు హాని, వినికిడి కోల్పోవడం, కాళ్ళు, చేతులు నిస్సత్తువుగా మారంటం వంటి సమస్యలు

 • 09 Dec 2020 19:33 PM (IST)

  రక్తంలో నికెల్ ఎందుకు.? ఎంత ఉంటే ఆరోగ్యం, ప్రాణాలకు తీవ్ర ముప్పు.?

  > వేరుశనగ, డ్రైబీన్స్, సోయాబీన్, గ్రేయిన్స్, చాకోలేట్స్ లో లభించే నికెల్
  > శరీరానికి చాలా కొద్ది పరిమాణంలో అవసరమయ్యే నికెల్
  > ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండటం కోసం నికెల్ ప్రయోజనకరం
  > రసాయనిక ప్రక్రియకు దోహదపడే నికెల్
  > ఇప్పటివరకు మనుషులలో నికెల్ లోపించిన ఘటనలు అరుదు
  > జంతువులలో నికెల్ శాతం తగ్గిన ఘటనలు చాలానే
  > నికెల్ ఎలర్జీ అనేది సాధారణ అంశమేనంటున్న డాక్టర్లు
  > నిఖేల్ లోపం వల్ల దురద, దద్దర్లు
  > చెవిపోగులు, వివిధ ఆభరణాలు వాడటం నాణాలు, సెల్ ఫోన్లు, కంటిఅద్దాల ప్రేమ్స్ వల్ల నికెల్ అలెర్జీలు
  > అమెరికాలోని ది అక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినేస్ట్రేషన్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సంస్థలు నికెల్ వాడకంపై పరిమితులను నిర్ణయించింది.
  > శరీరం భరించే నికెల్ పరిమాణం పనిచేసే స్థలాల్లో(8గంటలు) క్యూబిక్ మీటర్ కు ఒక మిల్లీ గ్రామ్
  > క్యూబిక్ మీటర్ కు 10మిల్లీ గ్రాములుంటే అక్కడ పనిచేసే వారి ఆరోగ్యం, ప్రాణాలకు తీవ్ర ముప్పు

 • 09 Dec 2020 19:27 PM (IST)

  నికెల్ ఏయే వస్తువుల తయారీలో వాడతారు.? అవి శరీరంలోకి ఎలా ప్రవేశించే అవకాశం ఉంది.?

  > నికెల్ ను ఇతర లోహాలతో కలిపి ఉపయోగిస్తారు
  > విమానాల తయారీ పరిశ్రమ, రక్షణ, రసాయన, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆయిల్, గ్యాస్, ఆటోమోబైల్, శక్తి రంగాలకు ప్రయోజనం
  > ముడి ఖనిజం రూపంలో దొరికిన నికెల్ ను శుద్ధి చేస్తారు
  > నికెల్ మండించడం వల్ల వాతావారణంలో కలుస్తుంది
  > ఇది మానవులకు హానికరం
  > నికెల్ కలిసిన పొగాకుతో కూడిన సిగరెట్లు హానికరం
  > నికెల్ కలిసిన ఆభరణాలు, షాంపూలు, డిటర్జెంట్లు, నాణేల నుంచి నేరుగా శరీరంలోకి
  > తక్కువ పరిణామంలో శరీరంలోకి
  > ఈ విష పదార్థాలను మూత్ర పిండాలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వాహిక వాటిని శరీరంలో కలవకుండా కాపాడి బయటకు పంపిస్తుంది.

 • 09 Dec 2020 19:26 PM (IST)

  ఏలూరులో వింత రోగం, లక్షణాలు:

  > ప్రజలు వింతగా ప్రవర్తించడం
  > బలహీనంగా మారడం
  > మూర్చ, నోట్లో నురగ, మెదడకు శ్వాస సరిగా అందకపోవడం

 • 09 Dec 2020 19:24 PM (IST)

  ఏలూరులో వింత రోగం: ఆహారం, నీటిలో ఉన్న సీసం(లెడ్), నికెల్ మూలకాలే కారణమా.?

  > సీసం, నికెల్ విష పదార్థాలు మనుషులపై ప్రభావం
  > ఆహారం, నీరు కలుషితం కావడమేనని నిర్ధారించిన ఎయిమ్స్ నిపుణులు
  > ఏలూరు పరిస్థితులు, ప్రభావిత ప్రజలను పరీక్షించిన ఎయిమ్స్
  > ఆహారం, నీరు కలుషితం కావడమేనని నిర్ధారణ
  > రక్త నమూనాల్లో ప్రమాదకర సీసం, నికెల్ మూలకాలు
  > మనుషుల న్యూరోలాజికల్( నెర్వస్) వ్యవస్థపై హానికర ప్రభావం చూపుతున్న మూలకాలు

 • 09 Dec 2020 19:07 PM (IST)

  ఏలూరు వింతరోగంపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న నిపుణులు, ఉన్నతాధికారులు :

  ఏలూరు వింతరోగంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ సమీక్షలో చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్ట్ లు, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొనగా, ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎయిమ్స్‌–ఢిల్లీ, ఎయిమ్స్‌– మంగళగిరి, డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. మరోవైపు ఏలూరు నుంచి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు, తదితరులు కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.

 • 09 Dec 2020 18:59 PM (IST)

  డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు:

  ‘అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాం. వారు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్య పరమైన వివరాలు తీసుకుంటున్నాం. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. మరోవైపు కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌లు కూడా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసిన నిపుణులు.

 • 09 Dec 2020 18:59 PM (IST)

  సీసీఎంబీ నిపుణులు:

  ‘ఏలూరులో అస్వస్థతకు వైరల్‌ కారణమా? అన్న దానిపై పరీక్షలు చేస్తున్నాం. ఫలితాలు రావడానికి, కచ్చితమైన నిర్ధారణలకు కొంత సమయం పడుతుంది’.

 • 09 Dec 2020 18:34 PM (IST)

  ఐఐసీటీ, హైదరాబాద్‌ నిపుణుల అభిప్రాయం:

  ‘తాగు నీటిపై వివిధ రకాల శాంపిళ్లు తీసుకున్నాం. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. పురుగు మందులు కారణంగా కూడా కాలుష్య కారక మూలకాలు కలిసే అవకాశాలు ఉంటాయి. తాగు నీటి పరీక్షల్లో అనుకున్న ప్రమాదకర సంకేతాలు కనిపించడం లేదు. కచ్చితమైన నిర్ధారణల కోసం సమగ్ర పరీక్షలు చేస్తున్నాం’.

 • 09 Dec 2020 18:27 PM (IST)

  ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌ నిపుణులు ఏమన్నారంటే…:

  ‘అస్వస్థతకు గురైన కుటుంబాలను పరిశీలించాం. 5 ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాం. అస్వస్థతకు గురైన వారిని కలుసుకున్నాం. వారు తీసుకున్న ఆహారం గురించి వివరాలు ఆరా తీశాం. కూరగాయలు, బ్లడ్, యూరిన్‌ శాంపిళ్లు తీసుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి కూడా కొన్ని శాంపిళ్లు తీసుకున్నాం. కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసిన రెండు మార్కెట్ల నుంచి శాంపిళ్లు సేకరించాం. సమగ్రంగా పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయిలో సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. ఇంకా విశ్లేషణ చేయాల్సి ఉంది. నీరు, ఆహారం, పాలు, యూరిన్, బ్లడ్‌ శాంపిళ్లపై మా నివేదికను ఇస్తాం’.

 • 09 Dec 2020 18:26 PM (IST)

  ఎయిమ్స్‌ మంగళగిరి నిపుణులు ఏమన్నారంటే…:

  ‘పురుగు మందుల ద్వారా ఆర్గానిక్‌ క్లోరైడ్స్‌ కలుషితమై అస్వస్థతకు దారి తీసిందన్నది ప్రాథమిక కారణం. దీనిపై కచ్చితమైన నిర్ధారణలు రావాల్సి ఉంది. అన్ని రకాలుగా కారణాలపై అధ్యయనం చేస్తున్నాం’.

 • 09 Dec 2020 18:11 PM (IST)

  ఏలూరు వింతరోగంపై ఎయిమ్స్‌ న్యూఢిల్లీ నిపుణులు ఏమన్నారంటే..:

  ‘ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సి ఉంది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. నికెల్‌ కూడా కనిపిస్తోంది. కాకపోతే భారతీయుల్లో నికెల్‌ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. సీసంవల్లే అస్వస్థతకు గురయ్యారన్నది ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని శాంపిళ్లను తెప్పించి పరీక్షలు చేస్తున్నాం. 24 గంటల తర్వాత అస్వస్థతకు గురైన వారు కోలుకోగానే వారి శరీరంలో సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. తాగు నీరు, పాల శాంపిళ్లను కూడా పరీక్షిస్తాం. వీలైనంత త్వరలో కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు వస్తాం’. ‘గతంలో లెడ్‌ పెట్రోల్‌ వాడే వాళ్లం. గాలిలో కూడా లెడ్‌ స్థాయి ఎక్కువగానే ఉండేది. అయితే ఇప్పుడు అన్‌ లెడెడ్‌ పెట్రోల్‌ వాడుతున్నాం. బ్యాటరీలు తిరిగి రీ సైక్లింగ్‌ చేసే ప్రక్రియ కూడా ఇప్పటి పరిస్థితికి దారి తీసి ఉండొచ్చు. పగలగొట్టిన బ్యాటరీలను డంప్‌ చేయడం వల్ల అవి భూమిలో కలిసి ఉండొచ్చు. లేదా వాటిని కాల్చినప్పుడు గాలిలో కలిసి ఉండొచ్చు. లేదా కూరగాయలు, ధాన్యం లాంటి.. వాటి ద్వారా అయినా శరీరాల్లో చేరి ఉండొచ్చు. ఇలా వేర్వేరు మార్గాల్లో మనుషుల శరీరాల్లోకి సీసం చేరే అవకాశం ఉంది. వీటన్నింటి మీదా పరిశోధిస్తున్నాం’.

 • 09 Dec 2020 17:03 PM (IST)

  ఏలూరులో జనం అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

  > ఏలూరులో అనారోగ్యంపై కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
  > కారణాలను నిర్ధారించడానికి సమగ్ర పరీక్షలు చేస్తున్నామన్న వైద్య బృందాలు, నిపుణులు
  > ప్రాథమికంగా సీసం మరియు ఆర్గనో క్లోరిన్‌పై అనుమానాలు
  > ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు వివరించిన అధికారులు
  > నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోవాలన్న సీఎం
  > శుక్రవారం మరోసారి వారందరితో వీడియో కాన్ఫరెన్స్‌
  > వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, ఎయిమ్స్‌ మంగళగరి, డబ్ల్యూహెచ్‌ఓ, సీసీఎంబీకి చెందిన నిపుణులు

 • 09 Dec 2020 16:31 PM (IST)

  ఏలూరు వింతవ్యాధి: పంపుల చెరువుపైనే ప్రధాన చర్చ, విస్తుపోయే నిజాలు.! టీవీ9 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్

  ఏలూరు వింత వ్యాధులు చాలా రోజులుగా వెంటాడుతున్నాయా..? మరి ఈ వారం రోజుల నుంచి మాత్రమే గుర్తించడానికి కారణం ఏంటి? సుమారు 15 రోజుల క్రితమే కీలక ప్రాంతం గా ఉన్న దక్షిణపు వీధిలో కేసులో బయటపడ్డాయి.. మరణాలు కూడా జరిగాయి. కానీ వాటిని ప్రభుత్వమే కాదు.. ఆ కుటుంబ సభ్యులు సైతం గుర్తించలేకపోయారు. మరోవైపు…పంపుల చెరువు ప్రధాన చర్చగా మారుతోంది. పంపుల చెరువు రిజర్వాయర్ సిబ్బంది కూడా 10 రోజుల క్రితమే ఇలా అస్వస్థతకు గురయ్యారంటున్నారు సిబ్బంది. వింత కేసుల పరిశోధన లో కీలకంగా కనిపిస్తున్న కేస్ స్టడీస్ తో టీవీ9 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్..

 • 09 Dec 2020 16:18 PM (IST)

  ఏలూరు హెల్త్ అప్డేట్స్.. చికిత్స పొందుతోన్న, కోలుకున్న వారి వివరాలు: మధ్యాహ్నం గం. 3.30 వరకూ ఉన్న పరిస్థితి

  Eluru Updated 3.30pm today

  Update data @ 3.30pm

  Total Admissions – 587
  On bed – 46
  Refferal – 32
  Discharge – 508

  Abstract report upto 3.30pm
  1 to 12 years – 74
  Male – 43
  Female – 31

  12 to 35 years _ 325
  Male 166
  Female 169

  More than 35years – 188
  Male – 106
  Female – 82

 • 09 Dec 2020 16:12 PM (IST)

  ఏలూరు హెల్త్ అప్డేట్స్.. చికిత్స పొందుతోన్న, కోలుకున్న వారి వివరాలు

  Update data from 5th Dec to today @ 12.30 pm..

  Total Admissions – 582
  On bed – 58
  Refferal – 31
  Discharge – 492
  Abstract report upto – 12.30pm

  1 to 12 years – 74
  Male – 43
  Female – 31

  13 to 35 years – 322
  Male – 163
  Female – 159

  Morethan 35years – 186
  Male – 105
  Female – 81

 • 09 Dec 2020 15:50 PM (IST)

  లెడ్ వల్ల ప్రమాదం, రక్తంలో10 మైక్రోగ్రామ్స్ కు మించి ఉండకూడదంటున్న డాక్టర్లు. ఏలూరులో అంతకు మించి ఉన్న లెడ్ శాతం

  రక్తంలో లెడ్ లోపించినా,పెరిగినా ప్రమాదమే
  రక్తంలో 10 మైక్రోగ్రామ్స్ కు మించి లెడ్ ఉండకూడదంటున్న డాక్టర్లు
  ఏలూరులో అంతకు మించి ఉన్న లెడ్ శాతం
  పైకి ఆరోగ్యంగా ఉన్నా రక్తంలో లెడ్ శాతం పెరిగితే సమస్యలే
  లెడ్ శాతం పెరిగితే నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు
  మెదడుకు హాని, వినికిడి కోల్పోవడం, కాళ్ళు, చేతులు నిస్సత్తువుగా మారంటం వంటి సమస్యలు
  లెడ్ శాతం పెరగటానికి కారణాలు
  తాగునీరు, బోరు వాటర్, రోడ్డుపక్కన అమ్ముతున్న తినేపదార్ధాలలో వాడే రంగులు
  ఇళ్ళలో పేరుకు పోయిన ధుమ్ము, ధూళి
  పెయింట్స్, కుంకుమ, సింధూరం, కాస్మోటిక్ కలర్స్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, ప్లాంట్ ఫుడ్స్, సంప్రదాయ కారక మందులు
  ప్రొటీన్ కలిగిన వస్తువులను మితంగా, అతిగా తీసుకున్నా సమస్యలే
  కాల్షియం, ఐరన్, జింక్ తక్కువగా ఉన్నా ఈ లెడ్ శాతానికి ప్రమాదం
  తక్కువ ధరకు దొరికే ప్లాస్టిక్ మగ్స్, లెడ్ పెన్సిల్స్, లెడ్ ఫ్రీ లేని రంగులు, బొమ్మలు వాడటం వల్ల సమస్య
  దేశంలోని ఏడు మేజర్ సిటీస్ లో ఈ లెడ్ శాతంతో బాధపడుతున్నవారి సంఖ్య 100 మిలియన్స్ వరకు ఉంటుందని అంచనా
  12 సంవత్సరాల లోపు పిల్లలకే 50 శాతం వరకు లెడ్ సంబంధ రోగం
  ఈ వ్యాధికి చిన్న పిల్లలు, గర్భవతుల పై ఎక్కువ ప్రభావం
  లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు
  నీటిలో సీసం, ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు సమస్యలు

 • 09 Dec 2020 15:46 PM (IST)

  ఏలూరులో వింత రోగానికి కారణాలు – ప్రాధమికంగా నిర్ధారణ

  జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పరిశీలన
  బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్‌
  రక్తంలో సీసం ( లెడ్) నికెల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తింపు
  తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో కేసులు
  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికిచ్చిన ఢిల్లీ ఎయిమ్స్‌
  లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు
  సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుంది
  తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని అంచనా
  అసలు సీసమ్ , నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనే అంశం పై పరిశోధన

 • 09 Dec 2020 15:12 PM (IST)

  ఏలూరులో అర్థరాత్రి ఏం జరుగుతోంది?

 • 09 Dec 2020 15:05 PM (IST)

  Eluru Mystery Disease: ఏలూరు వింత వ్యాధి వెనుక కారణాలేంటి..? – TV9 ground report

 • 09 Dec 2020 15:02 PM (IST)

  Eluru Disease: ఏలూరు అనారోగ్య బాధితులకోసం ఆరోగ్యశ్రీలో కొత్తగా మూడు రకాల ప్యాకేజీలు చేర్చుతూ ఉత్తర్వులు జారీచేశాం : వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

  ఏలూరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సదుపాయంతో పాటు మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను పెంచుతూ జీవోను విడుదల చేసినట్లు ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు అనారోగ్యానికి గురైన బాధితులకు ప్రభుత్వం నుండి సంపూర్ణమైన ఆసరా కల్పించాలని ఆదేశించడంతో ప్రభుత్వం సత్వరమే మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు వెలువరించినట్లు మంత్రి  చెప్పారు. ఈ మూడు రకాల చికిత్సలను చేర్చి ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు  నాని వెల్లడించారు.

 • 09 Dec 2020 14:29 PM (IST)

  ఏలూరులో వింత రోగానికి కారణాలు-ప్రాధమికంగా నిర్ధారణ

  ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలను జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పరిశీలించారు. బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ద్వారా ‌రక్తంలో సీసం ( లెడ్) నికెల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతుండగా.. ఈ వ్యాధికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. హెవీ మెటల్ లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు వచ్చాయని ఎయిమ్స్ బృందం భావిస్తోంది. సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుందని.. తాగునీరు, పాల ద్వారా అది రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అసలు సీసమ్ , నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనే అంశంపై పరిశోధన చేస్తున్నారు.

 • 09 Dec 2020 13:39 PM (IST)

  ఏలూరులో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పర్యటన..

  ఏలూరులో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పర్యటన..

  బాధితులతో మాట్లాడుతున్న ఎన్‌సీడీసీ ప్రతినిధులు..

  మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం పరిశీలన

  కేసులు నమోదవుతున్న కాలనీల్లో పర్యటించనున్న బృందం

  నీళ్లు, రోగుల శరీరాల్లో సీసం, నికెల్ అవశేషాలు

  ఢిల్లీ ఎయిమ్స్ తొలి, మలి విడత పరీక్షల్లో నిర్ధారణ..

  కొత్తగా 30 మంది పేషంట్ల శాంపిల్స్ సేకరించిన బృందం..

   

 • 09 Dec 2020 12:53 PM (IST)

  ఏలూరులో పెరుగుతున్న వింత వ్యాధి కేసులు..

  ఏలూరులో పెరుగుతున్న వింత వ్యాధి కేసులు..

  ఇవాళ కొత్తగా ఆసుపత్రిలో చేరిన 18 మంది..

  ఒకే కుటుంబంలో ఐదుగురికి సోకిన ఈ వింత వ్యాధి..

  589కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య..

  470 మంది డిశ్చార్జ్.. ప్రభుత్వ, ఆశ్రమ్ ఆసుపత్రుల్లో 89 మంది చికిత్స..

  విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో 30 మందికి చికిత్స

 • 09 Dec 2020 12:39 PM (IST)

  ఏలూరు ఘటనపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

  ఏలూరు ఘటనపై సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. వింత వ్యాధి కారణంగా వందలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. బాధితుల రక్త నమూనాల్లో లెడ్ , నికెల్‌లను వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా నీటి నమూనాల్లో క్రిమి సంహారక మందులు అత్యధిక మోతాదులో ఉన్నాయి. బాధితులకు అత్యున్నత వైద్యం అందించాలని సీఎం జగన్‌ను చంద్రబాబు కోరారు. ప్రత్యేకమైన కంట్రోల్ రూం , హెలైన్ ఏర్పాటు చేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏలూరులో అందరి రక్త నమూనాల సేకరణ , అత్యున్నత స్థాయిలో పరీక్షలు చేయాలని తెలిపారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమాతోపాటు , జీవిత బీమాను అందించాలన్నారు. ఏలూరుతో పాటు రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యంపై భరోసా ఇవ్వాలని చంద్రబాబు సీఎం జగన్‌కు తెలిపారు.

 • 09 Dec 2020 12:26 PM (IST)

  ఏలూరు నీటిలో పెస్టిసైడ్స్ మోతాదు మించి ఉన్నాయి.. డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి

  ‘నీటిలో పెస్టిసైడ్స్‌ మోతాదు ఎక్కువగా ఉంది. వీటిని ఆర్గనో క్లోరిన్స్‌ అంటారు. ఓపీ డీడీటీ, ఓపీ డీడీఈ లాంటి పలు రకాల నిషేధిత ఆర్గనో క్లోరిన్స్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇంత మోతాదులో ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థకు హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి ఎలా వచ్చాయన్న దానిపై పరిశీలన జరుగుతోందని డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

 • 09 Dec 2020 12:20 PM (IST)

  ఏలూరు వింత వ్యాధి.. నిరంతరం పర్యవేక్షిస్తున్న జగన్ సర్కార్..

  ఏలూరులో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ఆరా తీస్తున్నారు. సీఎంవో కార్యాలయం, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బాధితులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ మూడు రోజులుగా ఏలూరులోనే ఉంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వైద్య శిబిరాలు, కేంద్ర వైద్య బృందాలను రప్పించడం, వ్యాధి నిర్థారణ పరీక్షలు, నమూనాల సేకరణను పర్యవేక్షిస్తున్నారు.

 • 09 Dec 2020 12:17 PM (IST)

  ఐఐసీటీకి వివరాలు ఇలా ఉన్నాయి..

  ఏలూరులో దుకాణదారులు విక్రయిస్తున్న పురుగు మందుల వివరాలను అధికారులు ఆరా తీశారు. నిషేధించిన మందులు ఏవైనా విక్రయిస్తున్నారా? అనే కోణంలోనూ వివరాలు సేకరించి ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)కి పంపారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

 • 09 Dec 2020 12:11 PM (IST)

  589కి చేరుకున్న ఏలూరు వింత వ్యాధి బాధితుల సంఖ్య..

  ఏలూరు ప్రజల్లో కొనసాగుతున్న టెన్షన్. ఉదయం నుంచి ఇప్పటిదాకా కొత్తగా 18 కేసులు నమోదు కాగా.. దీనితో మొత్తం కేసుల సంఖ్య 589కి చేరింది. ఇప్పటికే ఎన్‌సీడీసీ బృందం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుంది. ఏలూరులో తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసురుతున్న వింత వ్యాధి. ఫిట్స్, వాంతులతో సొమ్మసిల్లి పడిపోతున్న బాధితులు..

 • 09 Dec 2020 11:51 AM (IST)

  ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 580కి చేరింది..

  ఏలూరులో వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 580కి చేరింది. వీరిలో 80 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. 469 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మృతి చెందారు. వింత వ్యాధికి కారణం ఏంటన్న దానిపై ఎయిమ్స్ నిపుణులు లోతుగా పరిశోధన చేస్తున్నారు.

 • 09 Dec 2020 11:47 AM (IST)

  ఏలూరు జనాల్లో వణుకు.. వింత వ్యాధి మూలాలపై ఇంకా రాని స్పష్టత..

  కరోనాకు మించి భయం సృష్టిస్తున్న ఈ వింత వ్యాధితో ఏలూరు జనం భయభ్రాంతులను గురవుతున్నారు. బయటికి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఆఖరికి స్వేచ్ఛగా గాలి పీల్చుకుందామన్నా జనాలు వణుకుతున్నారు. ఏలూరులో వింత వ్యాధి మూలాలపై ఇంకా రాని స్పష్టత.

 • 09 Dec 2020 11:41 AM (IST)

  ఇప్పటిదాకా మొత్తంగా 15 కేసులు నమోదు.. ఒకే కుటుంబం నుంచి ఐదుగురు..

  ఏలూరు జనాలను వింత వ్యాధి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో ఐదుగురికి ఈ వింత వ్యాధి సోకింది. కొంతమంది మూర్ఛపోయి పడిపోతుంటే.. మరికొందరు ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నారు. ఈ వింత వ్యాధికి కారణం తెలియక వైద్యులు సతమతమవుతున్నారు.

 • 09 Dec 2020 11:31 AM (IST)

  ఈరోజు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి..

  ఏలూరు తూర్పు వీధిలో శృతి, భార్గవి, పడమర వీధిలో అనురాధ, శంకరమఠం నుంచి నాగార్జునకు అస్వస్థత రావడంతో.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 580కి చేరింది.

 • 09 Dec 2020 11:20 AM (IST)

  ఇవాళ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా 8 వింత వ్యాధి కేసులు..

  రాత్రి నుంచి ఉదయానికి కాస్త తగ్గినట్లుగా అనిపించిన వింత వ్యాధి కేసులు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి.

 • 09 Dec 2020 11:20 AM (IST)

  ఏలూరులో విస్తరిస్తున్న వింత వ్యాధి..

  ఏలూరులో వింత వ్యాధి విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

 • 09 Dec 2020 11:20 AM (IST)

  ఏలూరు వింత వ్యాధి బారినపడ్డ వారి సంఖ్య.. వివరాలు.. ఇలా ఉన్నాయి..

  వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 571కి చేరింది. మొత్తం 468 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో 1 నుంచి 12 సంవత్సరాల మధ్య వారు 75 మంది ఉన్నారు. ఇందులో బాలురు 45, బాలికలు 30 మంది ఉన్నారు. 12 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 311 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 153మంది, మహిళలు 158 మంది ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 185 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 101, మహిళలు 84 మంది ఉన్నారు.