సూపర్ హీరోయిన్‌గా మారనున్న ఖతర్నాక్ కత్రినా.. ఇందుకోసం ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే..

బాలీవుడ్ ఖతర్నాక్ సుందరి కత్రినాకైఫ్ త్వరలోనే సూపర్ హీరోయిన్‌గా మారనుంది. గ్లామర్ పాత్రలు పోషించి బోర్ కొట్టినట్లుంది ఈ

  • Publish Date - 5:46 am, Wed, 9 December 20
సూపర్ హీరోయిన్‌గా మారనున్న ఖతర్నాక్ కత్రినా.. ఇందుకోసం ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే..

బాలీవుడ్ ఖతర్నాక్ సుందరి కత్రినాకైఫ్ త్వరలోనే సూపర్ హీరోయిన్‌గా మారనుంది. గ్లామర్ పాత్రలు పోషించి బోర్ కొట్టినట్లుంది ఈ అమ్మడుకి అందుకే హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ బడా హీరోలందరితో నటించిన ఈ భామ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంటుంది.

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే కత్రినా నిత్యం తన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అలీ అబ్బాస్ జాపర్ వహించే చిత్రలో సూపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెరపై ఆయుధాలు పట్టి పోరాటాలు చేయడం ఈ భామకు కొత్తేమి కాదు. ఈ సినిమాకు ‘సూపర్‌ సోల్జర్‌’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. బాలీవుడ్‌లో వస్తోన్న తొలి సూపర్‌ హీరోయిన్‌ చిత్రమిదే కావడం విశేషం. కాగా ఈ సినిమా కోసం కత్రినాకైఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుంది. ఇందులో ఎలాంటి రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా ఉండవు. కత్రినా పాత్ర చుట్టే కథ నడుస్తుంది. రొమాంచితమైన పోరాటఘట్టాల్లో కనిపిస్తుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.