అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వారి పనేనా..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అందులో అమితాబ్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టారు హ్యాకర్లు. అంతేకాదు ఆయన వ్యక్తిగత వివరాలలో లవ్ పాకిస్థాన్ అనిపేర్కొంటూ టర్కీష్ జెండా ఎమోజీని పొందపరిచారు. దీంతో బిగ్ బీ ముంబై సైబర్ యూనిట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మాట్లాడుతూ బిగ్ బీ ట్విట్టర్ హ్యాక్‌పై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. PRO Mumbai Police: We have informed […]

అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వారి పనేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 11, 2019 | 10:00 AM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అందులో అమితాబ్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టారు హ్యాకర్లు. అంతేకాదు ఆయన వ్యక్తిగత వివరాలలో లవ్ పాకిస్థాన్ అనిపేర్కొంటూ టర్కీష్ జెండా ఎమోజీని పొందపరిచారు. దీంతో బిగ్ బీ ముంబై సైబర్ యూనిట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మాట్లాడుతూ బిగ్ బీ ట్విట్టర్ హ్యాక్‌పై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

హ్యకర్లు పోస్ట్ చేసిన ట్వీట్‌లో ‘‘సమస్త ప్రపంచానికి ఇదే మా పిలుపు. టర్కీష్ ఫుట్ బాలర్స్ పట్ల ఐలాండ్ రిపబ్లిక్ ప్రవర్తించిన తీరును మేం ఖండిస్తున్నాం. మేం మృదువుగా మాట్లాడినా.. కఠినంగా వ్యవహరిస్తున్నాం. అది చెప్పడానికికే ఈ సైబర్ దాడి. అయిల్జిద్ టిమ్ టర్కీష్ సైబర్ ఆర్మీ’’ అంటూ తెలిపారు. అయితే ఇదే హ్యాకర్ల గ్రూప్ గతంలో షాహిద్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితులు ట్విట్టర్ల ఖాతాలను హ్యాక్ చేశారు.