‘బ్రోచెవారెవురా’కు రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేథా థామస్, నివేథా పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేది ఖరారైంది. జూన్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ […]
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేథా థామస్, నివేథా పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేది ఖరారైంది. జూన్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.