Coronavirus: అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన పడిన ..

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంటే.. మరోవైపు రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. దీంతో థర్డ్‌ వేవ్‌ ఆందోళనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి

Coronavirus: అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన పడిన ..
Amitabh Bachchan
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2022 | 4:52 PM

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరపెడుతోంటే.. మరోవైపు రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. దీంతో థర్డ్‌ వేవ్‌ ఆందోళనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో అయితే కరోనా ప్రకంపనలు ఆగడం లేదు. కొద్దిరోజుల క్రితం కపూర్‌ ఫ్యామిలీలో చాలామంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఆతర్వాత మృణాల్‌ఠాకూర్‌, నోరాఫతేహి, జాన్‌ అబ్రహం దంపతులు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. బాలీవుడ్‌ స్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ముంబయిలోని అమితాబ్‌ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. బిగ్‌బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన వారందరికి నెగిటివ్‌ వచ్చింది. అయితే అతని నుంచి ఇంకెంత మందికి ఈ వైరస్‌ సోకిందన్నది ఇంకా తేలాల్సి ఉంది.

కాగా గతేడాది అమితాబ్ కూడా కొవిడ్‌ 19 బారిన పడ్డారు. జూలైలో కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాదాపు 23 రోజులు చికిత్స తీసుకున్నారు. ఒక వారం తర్వాత అభిషేక్‌, ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరొసారి బిగ్‌బీ ఇంట్లో కరోనా టెన్షన్‌ పెడుతోంది. ‘అమితాబ్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. అయితే వారు కూడా క్వారంటైన్‌లో ఉంటున్నారు. కరోనా సోకిన వ్యక్తికి కూడా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ముందు జాగ్రత్తగా బిగ్‌ బీ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు’ అని బీఎంసీ(బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌) అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

Also Read:

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..

Kartik Aaryan: కార్తిక్‌.. బయటకు రా.. బాలీవుడ్‌ హీరో ఇంటి ముందు అమ్మాయిల హల్‌చల్‌.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..

Chinese Pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. ఏపీలోనూ అనుమానాస్పద పిజియోన్స్‌ గుర్తింపు..