AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan: కార్తిక్‌.. బయటకు రా.. బాలీవుడ్‌ హీరో ఇంటి ముందు అమ్మాయిల హల్‌చల్‌.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో ‘సోనీ కి టీటు కీ స్వీటీ’, ‘లుకా చుప్పి’, ‘పతి పత్నీ అవురో ఓహ్‌’, ‘లవ్‌ ఆజ్‌కల్‌ 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Kartik Aaryan: కార్తిక్‌.. బయటకు రా.. బాలీవుడ్‌ హీరో ఇంటి ముందు అమ్మాయిల హల్‌చల్‌.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..
Kartik Aaryan
Basha Shek
|

Updated on: Jan 05, 2022 | 3:19 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో ‘సోనీ కి టీటు కీ స్వీటీ’, ‘లుకా చుప్పి’, ‘పతి పత్నీ అవురో ఓహ్‌’, ‘లవ్‌ ఆజ్‌కల్‌ 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల అతను నటించిన ‘ధమాకా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న ఈ హ్యాండ్సమ్‌ హీరో అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటీవల కార్తిక్‌ లేడీ ఫ్యాన్స్‌ ఇద్దరూ అతని కోసం ఇంటి ఎదుట గోల గోల చేశారు. ముంబయిలో అతని ఇంటి ముందు రోడ్డుపై నిలబడి ‘కార్తిక్ దయచేసి బయటికి రా’ అంటూ బిగ్గరగా కేకలు వేశారు.

మీకు ఆత్మాభిమానం లేదా? కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానం పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ ఇద్దరూ అమ్మాయిలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీకు ఆత్మాభిమానం లేదా’ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘అలా అరవకుండా ఇంటికి వెళ్లండి’ అని మరొకరు స్పందించారు. ‘ఈ ఇద్దరూ అమ్మాయిలు వాళ్ల కుటుంబ సభ్యుల గురించి కూడా అంతే డెడికేషన్‌ చూపిస్తారా’ అని ఇంకొకరు ట్రోల్‌ చేశాడు. కాగా కార్తిక్‌ ప్రస్తుతం ‘షాహ్‌జాదా’ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘అల..వైకుంఠ పురములో ‘సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. దీంతో పాటు ‘భూల్‌భూలయ్యా’ సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు కార్తిక్‌. అదేవిధంగా అతను నటించిన ‘ఫ్రెడ్డీ’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read:

Chinese Pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. ఏపీలోనూ అనుమానాస్పద పిజియోన్స్‌ గుర్తింపు..

Varma Vs Kodali Nani: ‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్

Ram Gopal Varma: పేర్ని నాని వర్సెస్ రామ్ గోపాల్ వర్మ.. వరుస ట్వీట్స్‌తో నెట్టింట్లో రచ్చ చేస్తున్న ఆర్జీవీ..