సుశాంత్‌ బయోపిక్‌లో పాక్‌ నటుడు..!

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్ తెరకెక్కుతోందని, అందులో తాను సుశాంత్ పాత్రను పోషిస్తున్నానని

సుశాంత్‌ బయోపిక్‌లో పాక్‌ నటుడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 2:10 PM

Pakistan actor Hasan Khan: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్ తెరకెక్కుతోందని, అందులో తాను సుశాంత్ పాత్రను పోషిస్తున్నానని పాక్ నటుడు హసన్ ఖాన్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ అమెజాన్ వెబ్‌ సిరీస్‌లో రాబోతుందని హసన్ తెలిపారు. అంతేకాదు తాను నటించిన కొన్ని ఫొటోలను సైతం ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఇక ఈ విషయాన్ని రీట్వీట్ చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌.. ఈ ప్రాజెక్ట్‌ కోసం మా అకాడమీ గ్రాడ్యుయేట్‌ని ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది. అతడికి శుభాకాంక్షలను చెబుతున్నాము అని కామెంట్ పెట్టింది. అయితే ఈ వార్తలను అమెజాన్ ఖండించింది. తాము సుశాంత్ మీద ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయలేదని, ఏ నటుడిని ఫైనల్ చేయలేదని ఓ అధికారిక ప్రకటనను ఇచ్చింది. కాగా బాలీవుడ్‌లోనూ సుశాంత్ బయోపిక్‌ని అనౌన్స్ చేశారు. ఇందులో సుశాంత్‌ డూప్‌ సచిన్‌ తివారీ నటిస్తాడని నిర్మాతలు వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సచిన్ తప్పుకున్నట్లు ఆ తరువాత నిర్మాతలు తెలిపారు.

Read More:

అలర్ట్‌‌..18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా!

కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత

https://www.instagram.com/p/CD_-eIEJkUs/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CEGXf-tpeKR/?utm_source=ig_embed