AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆది పురుష్' చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని ప్రభాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. భార‌తీయ ఇతిహాస క‌థ‌తో దీన్ని రూపొందించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది నుంచి ఈ న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం..

ప్ర‌భాస్ 'ఆది పురుష్' గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 1:02 PM

Share

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘ఆది పురుష్’ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విష‌యాన్ని ప్రభాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. భార‌తీయ ఇతిహాస క‌థ‌తో దీన్ని రూపొందించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది నుంచి ఈ న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంద‌ని స‌మాచారం. ఇటీవ‌లే విడుద‌లైన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా గురించి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌ను కేటాయిస్తున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. కేవ‌లం విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోస‌మే దాదాపు రూ.250 కోట్ల ఖ‌ర్చు చేయ‌నున్నార‌ట‌.

ఇక ‘ఆదిపురుష్’ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర చేస్తుండ‌గా, సీత పాత్ర‌లో హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలను త్వ‌ర‌లోనే చిత్ర బృందం వెల్ల‌డించ‌నుంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్ట‌న్‌లో ‘రాధేశ్యామ్’, ‘నాగ్ అశ్విన్’‌తో ఓ సైన్స్ ఫిక్ష‌న్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల షూటింగ్ పూర్తి అయిన వెంట‌నే ఆది పురుష్ సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్‌. ఈ లెక్క‌న చూస్తే ప్ర‌భాస్ వ‌చ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Read More:

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?

ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. వైసీపీ ఎమ్మెల్యే పూజ‌లు

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర