బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ‘రాక్షసుడు’..!

బెల్లకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'రాక్షసుడు'. ఈ మూవీ అటు బెల్లకొండ శ్రీనివాస్‌కు, ఇటు రమేష్ వర్మకు మంచి హిట్ అందించింది.

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న 'రాక్షసుడు'..!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2020 | 6:57 PM

Rakshasudu Hindi Remake: బెల్లకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. ఈ మూవీ అటు బెల్లకొండ శ్రీనివాస్‌కు, ఇటు రమేష్ వర్మకు మంచి హిట్ అందించింది. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌ను నిర్మించారు. తమిళ సూపర్ హిట్ సినిమా ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లనుంది.

తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణ, ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారట. దీనికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. మరి నార్త్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో వేచి చూడాలి.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..