నేడు, రేపు మహారాష్ట్రలో భారీ వర్షాలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జోరుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న కరోనాతో ప్రజలు ఆవేదన చెందుతుంటే.. ఈ భారీ వర్షాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా ఆగష్టు 21, 22 తేదీల్లో ముంబైలో భారీ వర్షాలు కురవనున్నాయని..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జోరుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న కరోనాతో ప్రజలు ఆవేదన చెందుతుంటే.. ఈ భారీ వర్షాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా ఆగష్టు 21, 22 తేదీల్లో ముంబైలో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు పాల్ఘర్, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సతారాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక పూణెలో కూడా ఆగష్టు నేడు, రేపు అతి భారీ వర్షపాతం నమోదు కాబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
Read More:
సోనూ భాయ్ నాకూ సాయం చేయ్.. బ్రహ్మాజీ ట్వీట్
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలుః సీఎం జగన్