సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

ఇదిలా ఉంటే సోనూ కో అంటూ చాలా ర‌క‌ర‌కాల ఫ‌న్నీ మెసేజ్‌లు, వింత వితం రిక్వెస్ట్‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ కూడా సోనూ సూద్‌కి స‌హాయం అడుగుతూ ట్వీట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేశాడు. ''డియ‌ర్ సూప‌ర్ మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెష‌న్‌లో ఉన్నాను. మెంట‌ల్‌గా లాక్‌డైన్ అయ్యాను..

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 4:41 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్ప‌టికీ ఇంకా త‌న సేవ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నాడు. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌.. రియ‌ల్ లైఫ్లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అలాగే ఎవ‌రు స‌హాయం అడిగినా లేద‌నుకుండా అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికీ సాయం చేస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ప్రాంతం, కులం, భాషతో సంబంధం లేకుండా ఆప‌ద‌లో ఉన్న‌వారిని అండ‌గా నిలుస్తున్నాడు.

కాగా ఇదిలా ఉంటే సోనూ కో అంటూ చాలా ర‌క‌ర‌కాల ఫ‌న్నీ మెసేజ్‌లు, వింత వితం రిక్వెస్ట్‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ కూడా సోనూ సూద్‌కి స‌హాయం అడుగుతూ ట్వీట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేశాడు. ”డియ‌ర్ సూప‌ర్ మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెష‌న్‌లో ఉన్నాను. మెంట‌ల్‌గా లాక్‌డైన్ అయ్యాను. హైద‌రాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్ న‌న్ను ఇక్క‌డి నుంచి తీసుకెళ్లు. క్రోయేషియా” అంటూ బ్ర‌హ్మాజీ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియా వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. మరి బ్ర‌హ్మాజీ ట్వీట్‌కి సోనూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read More:

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన రైనా

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?